చంద్రబాబును జైలులో పెట్టింది జగన్ కాదు

టీడీపీ(TDP) బలహీనపడిందని, ఆ పార్టీకి జవసత్వాలు ఉడిగిపోయాయని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టంగా చెప్పారు. టిడిపి బలహీనపడిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు ఒప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీని జనసేన టేకోవర్ చేసినట్లయితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కోరారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. టిడిపి బలహీన పడిందనే పవన్ కల్యాణ్ పెడన సభ(Pedana Meeting)లో చెప్పిన మాటలను ఎల్లోమీడియా(Yellow Media) ఎక్కడా హైలెట్ చేయడం కాని.. ప్రచురించడం కాని చేయకుండా జాగ్రత్త పడ్డాయని ఎద్దేవా చేశారు. కేవలం తెలుగుదేశం, జనసేన పొత్తుతో జగన్ ను గద్దెదించుతామని ప్రకటించినట్లు ఎల్లోమీడియాలో చూశాం అన్నారు. కాని పవన్ కల్యాణ్ ఏమన్నాడనేది మీడియా కూడా గమనించే ఉంటారని అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ అన్నమాటలను మీకు చూపుతున్నానంటూ సభలో పవన్ మాటలను వీడియో ద్వారా ప్రదర్శించారు.

తనకు పలు కష్టాలున్నప్పటికి ఎన్‌డీఏ(NDA) నుంచి తాను బయటకు వచ్చానని పవన్ కల్యాణ్ ప్రకటించారన్నారు. టిడిపి బలహీనంగా ఉంది కాబట్టి జనసేన యువరక్తం దానికి ఎక్కించాలి అని పవన్ చెప్పారు. పవన్ మాటలను చూస్తే ప్రధానంగా చెప్పాలంటే మూడు అంశాలు ఉన్నాయి. ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చాను.. టిడిపి పార్టీ పని ఐపోయింది.. టిిడిపికి జనసేన ద్వారా యువరక్తం ఎక్కించి ఉత్సాహం నింపుతామని అంటున్నారు. ఆ పార్టీ బలహీనపడింది కాబట్టి జనసేన అవసరం ఉందని తెలియచేశారు.

ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాను అనే అంశంపై బీజేపీ(NJP) స్పందించాలి. బలహీనపడిందని దానికి తెలుగుదేశం నేతలు కంపెని టేకోవర్ కు ఒప్పుకున్నారా అనేది చెప్పాలి. చంద్రబాబు భాాషలో చెప్పాలంటే ఆయన సిఇఓ కాబట్టి టిడిపి కంపెనీ కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. చిత్రమైన విషయం ఏమంటే టిడిపి నేతలు పవన్ కల్యాణ్ కు స్వాగతం చెబుతూ బైక్ ర్యాలీలు కూడా జరిపినట్లున్నారు.కనీసం గౌరవం కూడా టిడిపి నేతలకు ఇచ్చినట్లు కనబడలేదు. బలహీనపడిన టిడిపికి తాను సేవియర్ ను అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నాడు. బలహీన పడిన పార్టీకి ఛాయిస్ ఉండదు కాబట్టి టిడిపికి ఎన్ని సీట్లు ఇస్తాడో పవన్ కల్యాణ్ చెప్పాలి. తెలుగుదేశం.. జనసేనలు ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో స్పష్టం చేయాలని కోరారు. ఎత్తిపోయిన కంపెని (టిడిపి)ని టేకోవర్ చేస్తుంటే టేకోవర్ చేసేవారికే షేర్లు ఎక్కువ వస్తాయన్నారు. జనసేన టేకోవర్ చేస్తుంటే జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. ఈ అనుమానాలను అటు టిడిపి ఇటు జనసేనలు రాష్ట్ర‌ ప్రజలకు నివృత్తి చేయాల్సి ఉందన్నారు.

ఈ మధ్య పవన్ కల్యాణ్ ఓ సభలో మాట్లాడుతూ.. మేం కూడా జగన్ లాగా పది 12 ఏళ్ళ నుంచి ఉన్నాం. జగన్ ఫస్ట్ టైమ్ అధికారంలోకి రాలేదు. రెండోసారి వచ్చారు. మాకు కూడా అవకాశం వస్తే మేం కూడా అధికారంలోకి వస్తాం అన్నారు. పవన్ కల్యాణ్ కూడా పిఆర్ పి నుంచి లెక్కవేసుకుంటే జగన్ కంటే ఎక్కువకాలంనుంచే ఉన్నారు కాబట్టి సీట్ల విషయంలో టిడిపి, జనసేనలు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.

చంద్రబాబు(Chandrababu)ను జైలులో పెట్టింది వైయస్ జగన్ కాదు అని స్పష్టం చేసారు. కోర్టు చెప్పింది కాబట్టే జైలులో ఉన్నారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఆయా కేసులకు సంబంధించి లోకేష్ తోపాటు వారి లాయర్లు అటు ఢిల్లీలోన బెయిల్ కోసం ఇక్కడ యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది అధికారిక సమావేశంతోపాటు రాష్ట్ర‌ ప్రయోజనాలకు సంబంధించి పలువురుని కలిసేందుకు అనేది గమనించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర‌ సంబంధాల విషయంలో వైయస్ జగన్ బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరి వల్లనే రాష్ట్రానికి గతం కంటే ఎక్కువే సాధించారన్నారు. అవి కళ్లకు కనబడుతూనే ఉన్నాయన్నారు. టిడిపి నేతలు పొద్దుపోని ఆరోపణలతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం వైయస్ జగన్ కు లేదన్నారు. చంద్రబాబు గతంలో 60..70 సార్లు ఢిల్లీ వెళ్లి కూడా రాష్ట్ర‌ ప్రయోజనాలు కాకుండా తన పర్సనల్ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.

Updated On 5 Oct 2023 9:28 PM GMT
Yagnik

Yagnik

Next Story