Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు ఆ సమయానికి లొంగిపోవాల్సి ఉంటుంది
చంద్రబాబుకు ఈరోజు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇచ్చిన బెయిల్ గానీ.. టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నట్టుగా నిజం గెలిచినట్టు కాదని అందరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు(Chandrababu)కు ఈరోజు న్యాయస్థానం మధ్యంతర బెయిల్(Bail) ఇచ్చింది. ఆయన ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇచ్చిన బెయిల్ గానీ.. టీడీపీ నేతల(TDP Leaders)తో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నట్టుగా నిజం గెలిచినట్టు కాదని అందరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఆయనకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమే. అంటే.. కేవలం 30 రోజుల పాటు (నాలుగు వారాలు) కంటికి ఆపరేషన్ చేయించుకుని మరలా నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోగా చంద్రబాబు లొంగిపోవాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే, ఆయన కుటుంబ సభ్యులు ఒకవైపు, టీడీపీ నేతలు మరోవైపు చప్పట్లు కొట్టుకుంటూ.. సంబరాలు చేసుకుంటూ.. కేసులో నిజం గెలిచిందన్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కేసు మెరిట్స్ మాట్లాడకుండా.. కేసు విచారణ ఆసాంతం జరగకుండానే మీరు నిజం గెలిచిందని ఎలా చెప్పుకుంటారు..? అని ప్రశ్నించారు. గౌరవ న్యాయస్థానం మంజూరు చేసిన కండీషన్ బెయిల్ ఆర్డర్(Conditional Bail Order)ను తెప్పించుకుని చదువుకోవడం మంచిదని సూచించారు.
చంద్రబాబు ఆరోగ్యం(Chandrababu Health)పై మొదట్నుంచీ టీడీపీ నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నానా హంగామా చేస్తున్నారని అన్నారు. ఆయనకున్నటువంటి చర్మవ్యాధిని అదేదో ప్రాణాంతకమౌతుందన్నట్టు బెయిల్‌కు నానా రకాల అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు ఉన్నటువంటి చర్మవ్యాధిని ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసేలా వారికి వారే ప్రచారం చేసుకుంటూ ఆందోళన చేసుకున్నారని అన్నారు. ఆయన ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వపరంగా గానీ.. జైలు అధికారుల నుంచి గానీ సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా చిన్నలోపం జరగలేదనేది గౌరవ న్యాయస్థానం అంగీకరించిందన్నారు.
ప్రస్తుతం న్యాయస్థానం మాత్రం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం నిమిత్తమే మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీనిపైనా ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అంత అత్యవసరం కాదని చెప్పినప్పటికీ.. గౌరవ న్యాయస్థానం మానవీయకోణంలో ఒక జైలు ఖైదీకి ఉన్నటువంటి హక్కుల ప్రకారం మధ్యంతర బెయిల్ ఇచ్చిందని అన్నారు.
చంద్రబాబు, స్కిల్ స్కాం కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన దొంగ.. అందుకే, రాజమండ్రి జెలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారని అన్నారు. కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసమే ఆయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తప్ప.. ఈ కేసు కొట్టేయలేదు గదా..? మరి, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కేడర్ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్ధమేంటి..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. అది ఇంకా విచారణలో ఉంది. కేసు మెరిట్స్‌పై విచారణ న్యాయస్థానంలో జరగలేదు. పోనీ.. ఆయనేమన్నా నిర్దోషిగా బయటకొస్తున్నారా..? అంటే, అదీ కాదు. మరెందుకు వాళ్లంతగా సంబరాలు చేసుకుంటున్నారో వారికే అర్ధం కావాలి. అసలు వాళ్లకు సిగ్గుండాలి కదా..? ప్రజలకు కూడా ఈరోజు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పట్ల చాలా స్పష్టత ఉందని అన్నారు.