ఓట్ల తొలగింపుపై టీడీపీది(TDP) తప్పుడు ప్రచారమని, దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా ఆ పార్టీ తీరు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారు
టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందే
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)

ఓట్ల తొలగింపుపై టీడీపీది(TDP) తప్పుడు ప్రచారమని, దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా ఆ పార్టీ తీరు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ(TDP) గతంలో చేసిన తప్పులను మేము సరి చేశాం. వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఓటర్ల జాబితాలో(Voter list) అక్రమాలు చేశారు. టీడీపీ చేసిన అక్రమాలపై మేము గతంలో పోరాడాం. వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోంది. టీడీపీకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు(Chandra babu) పీహెచ్‌డీ చేశారు.. ఆయన తన విద్యలను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారు. గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటని మండిపడ్డారు. టీడీపీలో గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించాం. ఉరవకొండలో అక్రమాలంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

లక్షల దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయి. వీటన్నిటినీ ఎన్నికల కమిషన్ తొలగిస్తే ప్రజా తీర్పు కచ్చితంగా వస్తుందని మా నమ్మకం. కుప్పం నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు బయట పడ్డాయి. దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుంది. టీడీపీ అన్యాయంగా తీసేయించిన ఓట్లను మేము చేర్పించుకుంటాం. గతంలో చంద్రబాబు ఒకే ఇంటి నెంబర్ మీద 770 ఓట్లను చేర్పించారు. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో చేసిన ప్రొసీజర్ సరిగా లేనందునే అధికారులను సస్పెండ్ చేశారు. అంతేకానీ ఓట్లను తొలగించారని కాదు. బ్లూఫ్రాగ్ అనే సంస్థకు ప్రభుత్వ డేటాని ఇచ్చారు. ఐటీ గ్రిడ్స్ అనే ఇంకో సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి సేవామిత్ర అనే యాప్‌ని జోడించి ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని సజ్జల ధ్వజమెత్తారు. ఈ యాప్ ను రాష్ట్రమంతా టీడీపీ కార్యకర్తల చేతిలో పెట్టి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించారు. సాక్షి పేపర్ చదివుతావా? ఏ టీవీ చూస్తారంటూ సర్వే చేశారు. వైసీపీ అనుకూలం అనుకున్న వారందరి ఓట్లనూ సుమారు యాభై లక్షలు తొలగించారు. ఎంతో పోరాటం చేసి మళ్ళీ కొంతవరకు మా ఓట్లను చేర్పించుకోగలిగాం. అలాంటి దిక్కుమాలిన పనులు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు. ఎలక్షన్ కమిషనర్‌ని చంద్రబాబు అప్పట్లో బెదిరించారు. అలాంటి పనులు మేము చేయాల్సిన పని మాకు లేదు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసే మేము భయపడాల్సిన పనిలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Updated On 24 Aug 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story