టీడీపీ(TDP) నేతలు బరితెగించారని.. వారికి ఎల్లో మీడియా(Yellow Media) వంతపాడుతోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramaksri) అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తీసుకువచ్చిన 100 పథకాలను మేం నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు(Chandrababu) కనీసం ఒక్క పథకం అయినా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా పథకాలు తీసుకువస్తే కదా...

టీడీపీ(TDP) నేతలు బరితెగించారని.. వారికి ఎల్లో మీడియా(Yellow Media) వంతపాడుతోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramaksri) అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తీసుకువచ్చిన 100 పథకాలను మేం నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు(Chandrababu) కనీసం ఒక్క పథకం అయినా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా పథకాలు తీసుకువస్తే కదా... వాటిని జగన్ ఆపడానికి అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అని చూడకుండా జగన్ అందరికీ పథకాలు వర్తింపజేస్తున్నారని.. టీడీపీ మద్దతుదారులకు ఒక్క పథకం ఆగిందని ఎవరైనా చెప్పగలరా? అని సజ్జల సవాల్ విసిరారు.

గత ప్ర‌భుత్వంలో ఉచిత ఇసుక అన్నారు.. మరి ఇసుక ఉచితం అయితే నాటి దెందులూరు ఎమ్మెల్యే ఎమ్మార్వో(MRO) జుట్టు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది.? ఇసుక ఉచితం అయితే జేసీబీలు(BJP) పెట్టాల్సిన అవసరం ఏంటి.? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు రూ.100 కోట్ల జరిమానా విధించింది.? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. జగన్(Jagan) పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని స‌జ్జ‌ల‌ విమర్శించారు. వైసీపీ(YCP) సామాజిక సాధికార యాత్రల్లో ఖాళీ కుర్చీలు అంటూ కథనాలు రాస్తారు. సభ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలను ఫొటోలు తీసి ఈ కథనాలు రాస్తుంటారని.. పచ్చ పైత్యం పతాకస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోతున్నాయని ఎల్లో మీడియా రాస్తోంది.. హాస్పిట‌ల్స్‌ రోగులతో కళకళలాడాలన్నది మీ ఉద్దేశమా.? అని సజ్జల ప్రశ్నించారు.

Updated On 27 Nov 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story