నకిలీ ఓట్లపై సజ్జల రామకృష్ణారెడ్డిని(Sajjala Ramakrishna Reddy) టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్‌(Dhulipalla Narender) ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు సజ్జల భార్గవ్‌(Sajjala Bhargav) కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ నేత నరేందర్‌ ట్వీట్‌లో 'క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్‌గా బుక్.. రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు.. పొన్నూరులో ఒక ఓటు.... మంగళగిరిలో మరో ఓటు' రాసుకొచ్చారు

నకిలీ ఓట్లపై సజ్జల రామకృష్ణారెడ్డిని(Sajjala Ramakrishna Reddy) టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్‌(Dhulipalla Narender) ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు సజ్జల భార్గవ్‌(Sajjala Bhargav) కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ నేత నరేందర్‌ ట్వీట్‌లో 'క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్‌గా బుక్.. రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు.. పొన్నూరులో ఒక ఓటు.... మంగళగిరిలో మరో ఓటు' రాసుకొచ్చారు. దీనిపై సజ్జల భార్గవ్‌ ఘాటుగా స్పందించారు.

టీడీపీ(TDP) నేత నరేందర్‌ వేసిన ట్వీట్‌ను ఖండిస్తూ సజ్జల భార్గవ్‌ కూడా ట్విట్టర్‌ ద్వార సమాధానం ఇచ్చారు. సజ్జల భార్గవ్‌ ట్వీట్‌లో 'పొన్నూరు, మంగళగిరి రెండూ పక్క పక్క నియోజకవర్గాలు, మేము ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లు రెండు నియోజకవర్గాల బోర్డర్ లో ఉన్న గ్రామాల పరిధిలోకి వస్తుంది. సాంకేతిక లోపం వల్ల ఓట‌ర్ల జాబితాలో మా పేర్లు రెండు చోట్ల న‌మోదైన విష‌యం మా దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఒక‌చోట తొల‌గింపున‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోవాలని జ‌న‌వ‌రి 31న అధికారుల‌ను కోరాం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అయితే ఈలోపే మీరు ఆరాటం ఆపుకోలేక దుష్ప్ర‌చారం చేస్తున్నారు. మీలాగా దొంగ ఓట్లు న‌మోదు చేసుకుని గెల‌వాల‌ని చూసే అల‌వాటు మాకు లేదు. మీ నాయకుడు @ncbn మాదిరి కుప్పంలో ప‌క్క రాష్ట్రానికి చెందిన 30 వేల మందికి ఓటుహ‌క్కు క‌ల్పించి, ఎమ్మెల్యేగా గెలిచే బాపతు మేము కాదులే' అని రాసుకొచ్చారు.

Updated On 14 Feb 2024 2:52 AM GMT
Ehatv

Ehatv

Next Story