ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ఎలాంటివారో నాలుగు దశాబ్దాలుగా ఆయనను అబ్సర్వ్‌ చేస్తున్నవారందరికీ తెలుసు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ఎలాంటివారో నాలుగు దశాబ్దాలుగా ఆయనను అబ్సర్వ్‌ చేస్తున్నవారందరికీ తెలుసు. యూటర్న్‌లలో చంద్రబాబును మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు తిట్టిన వారితో ఇవాళ ఏ మాత్రం మొహమాట పడకుండా చెలిమి చేయగలరు. అవసరానికి ఎంతపనైనా చేస్తారు. తనకు కావాల్సింది సాధించుకుంటారు. ప్రధాని నరేంద్రమోదీని(Narendramodi) పరుష పదజాలంతో తిట్టిన చంద్రబాబు మళ్లీ ఆయన పంచన చేరతారని ఎవరైనా ఊహించామా? 2018లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఆరు నెలలకే ఆ పార్టీకి దూరంగా జరిగారు. కమ్యూనిస్టు పార్టీలను కూడా అలాగే చేశారు. అందుకే జనసేన(Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) ఫ్రెండ్‌షిప్‌ ఎన్నాళ్లు ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగుదేశంపార్టీ(TDP) నీడలో ఉన్నన్నాళ్లు జనసేనకు ఎదుగుబొదుగు ఉండదన్నది నిఖార్సైన సత్యం. ఇలాగే ఉంటే పవన్‌ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. ఉప ముఖ్యమంత్రిగానే ఉంటూ లోకేశ్‌కు(Lokesh) కూడా జీ హుజూర్‌ అనే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం జనసేనలో ఎవరైనా చేరాలనుకుంటే చంద్రబాబు పర్మిషన్‌ కావాలట! పరిస్థితులు అలాగున్నాయి మరి! పవన్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం సామంతరాజులాగే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీని విస్తృతపరిచే వాతావరణం లేదు. పవన్‌ అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కూటమి నుంచి జనసేన తప్పుకున్నా ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదు. అందుకే చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. అన్నింటా టీడీపీ మార్కు కనిపించాలనే అనుకుంటున్నారు. వరద బాధితుల సహాయార్ధం సినిమా ఇండస్ట్రీ వారు తమకు తోచినంత విరాళాలు ఇస్తున్నారు కదా! సీఎం సహాయనిధికి ఇవ్వడానికి పోటీ పడుతున్నారు కదా! విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబుకు చెక్కు ఇచ్చి చక్కటి ఫోటో ఒకటి దిగేసి వస్తున్నారు. సీఎం కాబట్టి చంద్రబాబుకే చెక్కులు ఇస్తారు. ఒకవేళ చంద్రబాబు బిజీగా ఉండి, అపాయింట్మెంట్‌ దొరకలేదనుకోండి. అప్పుడు చెక్కులు ఎవరికి ఇవ్వాలి? లెక్కకైతే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఇవ్వాలి. పవన్‌ సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటప్పుడు పవన్‌ను కలిసి చెక్కులివ్వడానికి ఎవరు మాత్ర ఉబలాటపడరు? కానీ చిత్రమేమిటంటే పవన్‌ దగ్గరకు ఎవరూ వెళ్లడం లేదు. చంద్రబాబు దొరకని సందర్భాలలో లోకేశ్‌ దగ్గరకు వెళ్లి చెక్కులిస్తున్నారే తప్ప పవన్‌ దగ్గరకు వెళ్లడం లేదు. సాయి దుర్గతేజ్‌(Sai durga Tej) కూడా లోకేశ్‌కు చెక్కు ఇచ్చారే తప్ప వపన్‌కు కాదు. తను సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నానని పవన్‌కు సాయిదుర్గ తేజ్‌ చెప్పకుండా ఎలా ఉంటారు? చెప్పే ఉంటారు. ఎంత అమౌంట్‌ ఇవ్వాలి? చెక్కు ఎవరికి ఇవ్వాలి? అన్న విషయాలు పవన్‌ తన మేనల్లుడికి చెప్పే ఉంటారు. అంటూ పవన్‌ను ఉద్దేశపూర్వకంగా లో ప్రొఫైల్‌లో టీడీపీ ఉంచుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వదల్చుకున్నవారు సీఎంకో, డిప్యూటీ సీఎంకో ఇస్తారు కానీ సీఎం కొడుకు దగ్గరకు వెళ్లరు కదా! మరి అందరూ ఎందుకు వెళుతున్నారు? లోకేశ్‌ కేవలం మంత్రే కదా! డిప్యూటీ సీఎం కంటే తక్కువ హోదానే కదా! అయినా లోకేశ్‌ దగ్గరకు ఎందుకు వెళుతున్నారు? అంటే ఏదో జరుగుతుందనే సందేహం కలుగుతోంది. మొదట్లో వరద బాధితులను పరామర్శించడానిక పవన్‌ ఎందుకు వెళ్లలేదంటే .. మీరు వస్తే జనం మీద పడతారు కాబట్టి చంద్రబాబు వద్దంటున్నారు అని అధికార యంత్రాంగం పవన్‌కు చెప్పి ఉంటుందేమో! మీడియాతో పవన్‌ ఈ మాటే అన్నారు. అది బ్యాక్‌ ఫైర్‌ అయ్యేసరికి పవన్‌ పిఠాపురం వెళ్లారు. పిఠాపురం బాధితులు ఎవరూ పవన్‌ చుట్టు మూగలేదు. పిఠాపురం తప్ప మరో చోటికి పవన్‌ వెళ్లలేదు. అంటే పిఠాపురానికి పవన్‌ను కట్టడి చేశారన్నమాట బాబు! మొత్తం మీద పవన్‌ను సైడ్‌లైన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌ అయితే, నెంబర్ టు లోకేశేనని జరుగుతున్న సంఘటనలను బట్టి అనుకోవాలి.

Eha Tv

Eha Tv

Next Story