Sadineni Yamini : కాంగ్రెస్ అంటే స్కామ్.. బీజేపీ అంటేనే అభివృద్ధి
గురిగింజ నలుపు తనకు తెలియదు అన్నట్టు 6 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, లంచగొండితనం, దోపీడీలలో కురుకుపోయి దేశాన్ని, దేశ ప్రజల కష్టాన్ని దోచుకుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు.
గురిగింజ నలుపు తనకు తెలియదు అన్నట్టు 6 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అవినీతి, లంచగొండితనం, దోపీడీలలో కురుకుపోయి దేశాన్ని, దేశ ప్రజల కష్టాన్ని దోచుకుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని(Sadineni Yamini) ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.
ఝార్ఖండ్(Jharkhand) కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు(Dheeraj Sahu) ఇంట్లో దాదాపుగా 200-300 కోట్ల అవినీతి సొమ్ము ఇంట్లో బీరువాలో ఉన్నాయంటే.. దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారో ఊహించుకోవచ్చన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుందని ఎద్దేవా చేశారు.
2014 వరకూ 18వేల గ్రామాలు విద్యుత్తు లేని గ్రామాలున్నాయని తెలిపారు. 2014 తర్వాత నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రభుత్వంలో ప్రతి రంగంలో అభివృద్ధి కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ అంటేనే స్కాము(Scam) భారతీయ జనతా పార్టీ(BJP) అంటే అభివృద్ధి(Development) అని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే అభివృద్ధి ఫలాలు చిట్టచివరి ప్రజల వరకు చేరాలని అర్ధం అని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కేంద్ర ప్రభుత్వం నుండి 100 రూపాయలు బయటికి వస్తే కింద లబ్ధిదారుడికి ఒక్క రూపాయి చేరేది. మధ్యలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతిని చేసేవారు కానీ బీజేపీ హయాంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోందన్నారు. అదే కోవలో ప్రస్తుత వైసీపీ(YSRCP) ప్రభుత్వం కూడా దోచుకోవడం దాచుకోవడం అనే నినాదం పాటిస్తూ ఉన్నదని ఆరోపించారు. ఇష్టారాజ్యాంగా ప్రజల సొమ్మును దోచుకుంటూ దోపిడీ చేస్తోందన్నారు. ప్రజలు ఈ అవినీతి పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.