భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది.

భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఉద్ద‌శంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి గ‌తంలో తెలంగాణ‌కు చెందిన ఆర్‌.కృష్ణ‌య్య‌ను రాజ్య‌స‌భ‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోవ‌డంతో కృష్ణ‌య్య ఆ పార్టీకి, దాని ద్వారా వ‌చ్చిన రాజ్య‌సభ స‌భ్య‌త్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డానికే వైసీపీకి, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్టు కృష్ణ‌య్య అప్పుడు చెప్పుకున్నారు. అంతకు ముందు నుంచే బీజేపీతో ఆర్‌.కృష్ణయ్య ట‌చ్‌లో ఉన్నార‌ని, ఆ పార్టీ ద్వారా ముంద‌స్తు ఒప్పందంలో భాగంగానే రాజీనామా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవి ఇప్పుడు నిజమయ్యాయి. ఇదలా ఉంచితే , బీజేపీ తరఫున ఆర్‌.కృష్ణయ్య రాజ్యసభకు వెళ్లడం వెనుక చాలా జరిగింది. కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా బీజేపీ అధినాయకత్వాన్ని కోరింది వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డేనని విశ్వసనీయ సమాచారం. బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లడానికి సుజనా చౌదరి అనేక ప్రయత్నాలు చేశారు. రాజ్యసభలో చోటు దొరికితే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం పెద్ద కష్టమైన పనికాదన్నది సుజనా చౌదరి భావన! ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సుజనా ప్లేస్‌లో ఆర్‌.కృష్ణయ్యను ప్రమోట్‌ చేసింది. దీని వల్ల బీసీ సామాజికవర్గానికి దగ్గర కావచ్చన్నది ఆ పార్టీ అభిప్రాయం. అలాగే ఢిల్లీ రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనించే వీలు కూడా చిక్కుతుంది. పైకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పైన కృష్ణయ్య ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ లోలోపల సఖ్యతగానే ఉన్నట్టు సమాచారం!

ehatv

ehatv

Next Story