ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కులాల చుట్టే తిరుగుతాయి. అధికారంకోసం రెడ్లు, కమ్మల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా రెడ్డి(Reddy), కమ్మ(Kamma)ల నాయకత్వంలోని పార్టీలే పోటీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలూ అధికారం కోసం కాపులను పావుగా వాడుతున్నాయి. కారణం.. కాపు సామాజికవర్గంలో ఒక బలమైన నాయకుడు లేకపోవడమే. ఇన్నాళ్లకూ ప్రజాదరణ కలిగిన గట్టి కాపునాయకుడొకరు పవన్ కల్యాణ్(Pavan Kalyan) రూపంలో కనిపించాడు. పవన్ కల్యాణ్ కాపులకు ఒక ఆశాకిరణంలా కనిపించాడు.

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కులాల చుట్టే తిరుగుతాయి. అధికారంకోసం రెడ్లు, కమ్మల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా రెడ్డి(Reddy), కమ్మ(Kamma)ల నాయకత్వంలోని పార్టీలే పోటీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలూ అధికారం కోసం కాపులను పావుగా వాడుతున్నాయి. కారణం.. కాపు సామాజికవర్గంలో ఒక బలమైన నాయకుడు లేకపోవడమే. ఇన్నాళ్లకూ ప్రజాదరణ కలిగిన గట్టి కాపునాయకుడొకరు పవన్ కల్యాణ్(Pavan Kalyan) రూపంలో కనిపించాడు. పవన్ కల్యాణ్ కాపులకు ఒక ఆశాకిరణంలా కనిపించాడు. ఖచ్చితంగా తమ సామాజికవర్గం నుంచి పవన్ కల్యాణ్ సీఎం అవుతారన్న భరోసా కలిగింది. ఇన్నాళ్లూ రాజ్యాధికారానికి దూరమైన కాపులు.. పవన్ కల్యాణ్‎ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. ఏపీలో ప్రభుత్వాలను శాంసించే స్థాయిలో ఉన్నా..ఇంత వరకూ కాపులెవరూ సీఎం పదవిని చేపట్టలేదు. రాజ్యాధికారన్ని పొందలేకపోయామనే ఆవేదన వారిలో ఉంది. టీడీపీ-జనసేన పొత్తు(tdp-janasena alliance)లో భాగంగానైనా ఆ కల నెరవేరుందని అంతా ఆశించారు. కానీ..నారా లోకేష్(Nara Lokesh) చేసిన కామెంట్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాయి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) ఉంటారని సెలవిచ్చారు యువనేత లోకేష్. పోనీ..డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా..? అంటే అలాంటి హామీ కూడా ఏదీ ఇవ్వలేదు. దీంతో పొత్తుల పేరుతో టీడీపీ నాయకత్వం..తమ నాయకుడిని దగా చేస్తు్న్నారనే భావనలోపడిపోయారు కాపులు. లోకేష్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుండగా..కాపులు మాత్రం కారాలు..మిరియాలు నూరుతున్నారు. భవిష్యత్తులో తమను మోసం చేశారనే అపవాదు రాకూడదనే ఉద్దేశంతోనే యువనేత లోకేష్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడనే విమర్శల నేపథ్యంలో మరోసారి అలాంటి చెడ్డ పేరు రావొద్దనే లోకేష్ ముందు జాగ్రత్త పడ్డారనేది టీడీపీ నేతలు చెబుతున్నమాట. అయితే..ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు అనౌన్స్ చేసి..కూటమి పార్టీల మధ్య కుంపటి రాజేశారని..రాజకీయంగా అది నష్టం చేస్తుందనే చర్చ జరుగుతోంది. మరి..నారా లోకేష్ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న కాపులు కూటమికి మద్దతుగా నిలుస్తారా? లేక.. గత ఎన్నికల్లో తాము వెన్నుదన్నుగా నిలబడిన..అధికార వైసీపీ(Ycp)కే మరోసారి జైకొడతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‎గా ఉంది. కాపులు ఎటువైపు వెళ్తారనేదానిపైనే పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం

Updated On 30 Dec 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story