తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 16 (శనివారం) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 16 (శనివారం) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కృష్ణా గ్రౌండ్స్‌లో కాంగ్రెస్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ డిక్లరేషన్‌ను ఆమోదించే సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, విశాఖపట్నంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మొదటి బహిరంగ ప్రసంగం ఇదే. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.

ఈ బహిరంగ కార్యక్రమానికి రేవంత్‌తో పాటు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల, సీడీబ్ల్యూసీ సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, మాజీ ఎంపీ కేవీ రామచంద్రరావు, తదితర కీలక నాయకులు హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు.

Updated On 15 March 2024 11:43 PM GMT
Yagnik

Yagnik

Next Story