Revanth Reddy Victory Celebrations At Bhimavaram : రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి ... భీమవరంలో సంబరాలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ పేరును ప్రకటించగానే తెలంగాణలో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం(Bhimavaram)లో కూడా సంబరాలు చేసుకున్నారు. అక్కడ ఎందుకు చేసుకున్నట్టు?

Revanth Reddy Victory Celebrations At BhimavaramRevanth Reddy Victory Celebrations At Bhimavaram
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ పేరును ప్రకటించగానే తెలంగాణలో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం(Bhimavaram)లో కూడా సంబరాలు చేసుకున్నారు. అక్కడ ఎందుకు చేసుకున్నట్టు? అసలు భీమవరంతో రేవంత్‌కు ఉన్న సంబంధమేమిటి? అన్న అనుమానాలు వస్తున్నాయి కదూ! పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం రేవంత్‌రెడ్డి వియ్యంకుడి పట్టణం. భీమవరానికి చెందిన వ్యాపారవేత్త గొలుగూరి వెంకటరెడ్డి కుమారుడు సత్యనారాయణరెడ్డికి రేవంత్‌రెడ్డి కూతురు నైమిషా రెడ్డిని ఇచ్చి 2015లో పెళ్లి చేశారు. తర్వాత రేవంత్‌రెడ్డి రెండుసార్లు వియ్యంకుడి ఇంటికి వచ్చారు. వెంకటరెడ్డికి భీమవరంతో పాటు హైదరాబాద్‌లో ఆటోమొబైల్, ఫైనాన్స్ ఇతర వ్యాపారాలు ఉన్నాయి. భీమవరానికి చెందిన చాలామందితో రేవంత్‌రెడ్డికి పరిచయాలు ఉన్నాయి.
