ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా(AP CM) 2019లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS JAGAN) ప్రమాణ స్వీకార(Swearing Ceremony) కార్యక్రమానికి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) హాజరయ్యారు. ఎం.కె.స్టాలిన్‌(MK STALIN) కూడా అందులో పాల్గొన్నారు. జగన్‌ అటు ఎన్డీయే కూటమికి కానీ, ఇటు యూపీఏ కూటమికి కానీ చెందనివాడు కాబట్టి కేసీఆర్‌ వెళ్లారు. కేసీఆర్‌ కూడా రెండు కూటములకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా(AP CM) 2019లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS JAGAN) ప్రమాణ స్వీకార(Swearing Ceremony) కార్యక్రమానికి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) హాజరయ్యారు. ఎం.కె.స్టాలిన్‌(MK STALIN) కూడా అందులో పాల్గొన్నారు. జగన్‌ అటు ఎన్డీయే కూటమికి కానీ, ఇటు యూపీఏ కూటమికి కానీ చెందనివాడు కాబట్టి కేసీఆర్‌ వెళ్లారు. కేసీఆర్‌ కూడా రెండు కూటములకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. సీఎంగా ప్రమాణం చేయడం ఆయనకు ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో(Narendra modi) పాటుగా ఇతర కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం ఉంటుందా? ఒకవేళ ఆహ్వానం అందితే రేవంత్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళతారా? వెళ్లరా? అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబుకు పిలుపు వెళ్లలేదు. ఆహ్వానం వెళ్లిందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం హాజరుకాలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరూ ఇందులో పాల్గొన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవ్వడం అనేది మంచి సంప్రదాయం. కానీ చంద్రబాబునాయుడు ఎన్టీయే కూటమిలో ఉండటంతో రేవంత్‌రెడ్డి డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి ఇండియా బ్లాక్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

Updated On 10 Jun 2024 12:07 PM GMT
Ehatv

Ehatv

Next Story