విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌(Vijay Kumar ) ఐక్యతా విజయపథం(Aikyatha Vijayapadham Padayatra) పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన యాత్రలు చేస్తున్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లో వస్తానంటున్న ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌(Vijay Kumar ) ఐక్యతా విజయపథం(Aikyatha Vijayapadham Padayatra) పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన యాత్రలు చేస్తున్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లో వస్తానంటున్న ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం స్పష్టం చేయలేదు. రీసెంట్‌గా జర్నలిస్టు వై.నర్సింహారావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ ఇన్సిడెంట్‌ను రివీల్‌ చేశారు. తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను ఆవేదనగా చెప్పారు. ఐఏఎస్‌ అధికారి అయిన తర్వాత కూడా వివక్షను ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు 2015లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పారు. ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో జరిగింది అది! 'ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు పని చేశాను. నన్ను వేరే చోటకు మార్చండి అని అడగటానికి అప్పుడున్న చీఫ్‌ సెక్రటరీ దగ్గరకు వెళ్లాను. ఇప్పుడున్న పరిస్థితులలో నిన్న వేరే జిల్లాకు పంపించాలని అనుకుంటున్నాము. తూర్పు గోదావరి ఖాళీ అవుతుంది. కానీ పుష్కరాలు ఉన్నాయి కదా! నిన్ను అక్కడ వేయలేం కదా! అని చీఫ్‌ సెక్రటరీ నాతో అన్నారు. మొదట ఆయన ఏమన్నారో నాకు అర్థం కాలేదు. పుష్కరాలు ఉన్నాయి కదా నిన్ను వేయలేం అని ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చిందో తర్వాత అర్థమయ్యింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్న ఆయన అలా అనేసరికి ఆశ్చర్యపోయాను. రెండు వేల సంవత్సరాలు దేశంలో చెలామణి అయిన మనుధర్మమే ఇప్పటికీ రూల్‌ చేస్తున్నదని తెలుసుకున్నాను. 70 ఏళ్ల కిందట వచ్చిన భారత రాజ్యంగం పరిగణనలోకి రాలేదు. అంబేద్కర్‌ రాసిన రాజ్యంగం అమలులోకి రాలేదు. మన బుర్రలోకి ఎక్కలేదు. దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేదు అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు. చీఫ్‌ సెక్రటరీ ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో అర్థమయ్యిన తర్వాత థాంక్స్‌ చెప్పి అక్కడ్నుంచి లేచి వచ్చేశాను' అని విజయ్‌కుమార్‌ ఎంతో ఆవేదనగా చెప్పుకొచ్చారు. నిజమే.. ఇన్నాళ్లయినా మనుస్మృతినే ఆచరిస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారి ఉద్దేశంలో రాజ్యంగం అంటే మనుస్మృతినే! అంబేద్కర్‌ రాసింది కాదు! గత పదేళ్లలో ఈ జాడ్యం మరింత పెరిగింది.

Updated On 31 Jan 2024 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story