Veligonda Project : వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితుల ఆందోళన
ప్రకాశం జిల్లామార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్ట్ (Veligonda Project) ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సీపీఎం (CPM) ఆధ్వర్యంలో కార్యాలయం ముందర నిరసనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అక్టోబర్ నెలలో వెలుగొండ ప్రాజెక్ట్ కు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల పునరావాస కేంద్రాలు ఏర్పాటు పూర్తి కాలేదని బాధితులు వాపోయారు.

Residents of veligonda project protest at markapur sub collector office
ప్రకాశం జిల్లామార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్ట్ (Veligonda Project) ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సీపీఎం (CPM) ఆధ్వర్యంలో కార్యాలయం ముందర నిరసనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అక్టోబర్ నెలలో వెలుగొండ ప్రాజెక్ట్ కు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల పునరావాస కేంద్రాలు ఏర్పాటు పూర్తి కాలేదని బాధితులు వాపోయారు. వెంటనే అర్ అండ్ అర్ ప్యాకేజీ నిధులను విడుదల చేయాలని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కు ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిగురించి వెంటనే ప్రభుత్వంతో చర్చించి నిధులువిడుదల చేయాలనీ.. లేకపోతే ఆందోళన మరింత ఆఉద్రుతం చేస్తామని బాధితులు తెలిపారు.
