Anti Rape Device : రేపెక్స్ పరికరంతో రేప్‌లు ఉండవు
రేపెక్స్ పరికరంతో రేప్‌లు ఉండవు
రేపెక్స్(Repex) పరికరం పేరు వినకపోయి ఉండవచ్చు. ఇది మహిళలను అత్యాచారాల నుంచి కాపాడుతుంది. సౌతాఫ్రికాకు(South africa) చెందిన ఓ మెడికల్ టెక్నీషియన్(Medical technician) సోనెట్ ఎహ్లర్స్ రేపెక్స్ పరికరాన్ని 2005లో తయారుచేశారు. ఇది చూసేందుకు కండోమ్‌లా(Condom) ఉంటుంది కానీ దానికి షార్ప్ పళ్లు ఉంటాయి. రేపుల నుంచి కాపాడుకునేందుకు మహిళలు యోని భాగంలో ఇది ధరించాలి. ఈ పరికరాన్ని ధరించినవారిపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడినట్లయింతే పురుషాంగానికి ఈ రేపెక్స్ పరికరం అతుక్కుంటుంది. దీనిని స్వయంగా తీసుకోలేం. మళ్లీ దానిని తొలగించాలంటే వైద్యుని దగ్గరికే వెళ్లాలి. అయితే ఇంత సేఫ్టీ పరికరం వాడుకలోకి రాలేదు. కొందరు దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది మధ్యయుగంలో శిక్షలు వేసేందుకు ఉపయోగించేదానిలా ఉందని వ్యతిరేకించారు. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లోకి పరికరం రాలేదు. అయితే సౌతాఫ్రికాలో కూడా ఈ రేపెక్స్ పరికరం వాడారా లేదా అనేది సమాచారం లేదు. అయితే ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువ అత్యాచారాలు అవుతున్న భారతదేశంలాంటి దేశాల్లో ఇలాంటి పరికరాలు ఉంటే ఉపయోగపడుతాయి కదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.