Renu Desai Reaction : పవన్‌కే నా సపోర్ట్.. రేణు దేశాయ్ సంచలన వీడియో..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సంచలన వీడియో విడుదల చేశారు. రాజకీయాలు, పెళ్లీళ్లపై ఆమె వీడియోలో కామెంట్స్ చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో.. పవన్ పెళ్ళిళ్ళ(Marriages) మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అంటున్నారు..

Renu Desai Reaction
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సంచలన వీడియో విడుదల చేశారు. రాజకీయాలు, పెళ్లీళ్లపై ఆమె వీడియోలో కామెంట్స్ చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో.. పవన్ పెళ్ళిళ్ళ(Marriages) మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అంటున్నారు.. అది మంచి పని కాదని అన్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన పిల్లల గురించి.. మాజీ భార్యల జీవితం గురించి ఉంటుందని తెలిసింది. నా ఇద్దరు పిల్లలనే కాదు. అయన మిగతా ఇద్దరి పిల్లలని కూడా ఇందులోకి లాగొద్దు. పర్సనల్‌గా ఆయన వల్ల నేను హర్ట్ అయ్యింది నిజం. నేను మూవ్ ఆన్ అయ్యాను కానీ.. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే సొసైటీకి ఆయన వల్ల మంచి జరుగుతుంది నమ్ముతున్నాను. పొలిటికల్‌గా పవన్‌కు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. రాజకీయాలు ఉంటే ప్రొఫెషనల్‌గా చూసుకోండి.. కానీ మా వ్యక్తిగత జీవితాలను ఇందులోకి లాగకండి అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
