AP Electricity Employees Strike : ఫలించిన చర్చలు.. సమ్మె ఆలోచన విరమించిన విద్యుత్ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించాయి.

Relief to AP government, power employees withdraw strike call
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్సీ(PRC)పై ఇరువైపుల నుంచి ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో విద్యుత్ సంఘాల జేఏసీ(JAC of Electricity Societies) సమ్మె(Strike)పై వెనక్కి తగ్గింది. ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదించాయి. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో.. డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. అలాగే.. పీఆర్సీపై ఎట్టలకే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. 8 శాతం ఫిట్‌మెంట్‌కు సైతం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
