తెలుగు రాష్ట్రాలు ఎండలకు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ఎండ చుర్రుమంటోంది. బయటకు రావడానికి జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడం భయాందోళనను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 48 మండలాలలో ఈరోజు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని 14 మండలాలలో వడగాలుల ప్రభావం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలు ఎండలకు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ఎండ చుర్రుమంటోంది. బయటకు రావడానికి జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడం భయాందోళనను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 48 మండలాలలో ఈరోజు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని 14 మండలాలలో వడగాలుల ప్రభావం ఉంటుంది. విజయనగరం జిల్లాలో తొమ్మిది మండలాలు, గుంటూరు జిల్లాలో ఏడు మండలాలు, కాకినాడ జిల్లాలో ఏడు మండలాలు, కృష్ణా జిల్లాలో నాలుగు మండలాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో నాలుగు మండనాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లా, విశాఖపట్నం జిల్లాలలో ఒక్కో మండలం చొప్పున తీవ్రమైన వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే వృద్ధులు, మహిళలు, చిన్నారులు వడదెబ్బ బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ గురైన వ్యక్తులకు సకాలంలో చికిత్స అందించకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

Updated On 21 April 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story