రాజకీయాలలో గెలుపోటములకు చాలా కారణాలుంటాయి. వైరిపక్షం బలాన్ని సరిగ్గా పసికట్ట లేక ఓటమిని కొని తెచ్చుకునేవాళ్లు కొందరైతే, వేసుకున్న అంచనాలు బెడిసికొట్టి పరాజయాన్ని మూటకట్టుకునేవాళ్లు మరికొందరు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(andhra Pradesh) అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. పునర్విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవి! దాంతో పాటుగా మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party) ఎన్నికల గోదాలో దిగడంతో విశ్లేషకులతో పాటుగా, ప్రజలూ ఆ ఎన్నికలపై ఆసక్తిని పెంచుకున్నారు.

రాజకీయాలలో గెలుపోటములకు చాలా కారణాలుంటాయి. వైరిపక్షం బలాన్ని సరిగ్గా పసికట్ట లేక ఓటమిని కొని తెచ్చుకునేవాళ్లు కొందరైతే, వేసుకున్న అంచనాలు బెడిసికొట్టి పరాజయాన్ని మూటకట్టుకునేవాళ్లు మరికొందరు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(andhra Pradesh) అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. పునర్విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవి! దాంతో పాటుగా మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party) ఎన్నికల గోదాలో దిగడంతో విశ్లేషకులతో పాటుగా, ప్రజలూ ఆ ఎన్నికలపై ఆసక్తిని పెంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని నిలుపుకోగలుతుందా? ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాగలుతుందా? తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహా కూటమి పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.

ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెప్పడంతో ఉత్కంఠ అమాంతం పెరిగింది. కొందరు ప్రజారాజ్యానికి తిరుగుండదన్నారు. మహాకూటమి అధికారంలోకి రావడం పక్కా అన్నారు మరికొందరు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఇంకొందరు జోస్యం చెప్పారు. ప్రజారాజ్యం వల్ల ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం అనే చర్చ కూడా మొదలయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ప్రజారాజ్యం చీలుస్తుందని, అది తెలుగుదేశానికి నష్టం తెస్తుందని విశ్లేషకులు లెక్కలు కట్టారు. ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌(Congress) మళ్లీ విజయం సాధించింది. గంపెడాశలు పెట్టుకున్న మహాకూటమికి నిరాశే మిగిలింది. ప్రజలు తమకే అధికారాన్ని కట్టబెడతారనుకున్న ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలకే పరిమితమయ్యింది.

ఫలితాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మహాకూటమి, ప్రజారాజ్యం పంచుకున్నాయని, ఆ కారణంగానే కాంగ్రెస్‌ గెలిచిందని విశ్లేషించారు. సరే కారణాలు ఏమైనప్పటికీ తెలుగుదేశంపార్టీ(TDP) ఓటమికి మాత్రం చాలా కారణాలున్నాయి. అప్పుడే పార్టీగా రూపాంతరం చెందిన లోక్‌సత్తాపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో లోక్‌సత్తా గణనీయమైన ఓట్లను సాధించగలిగింది. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఏడెనిమిది వేలకు మించి ఓట్లు పడ్డాయి. కూకట్‌పల్లి నుంచి నిల్చున్న జయప్రకాశ్‌కు 70 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. పటాన్‌చెరు, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్‌బి నగర్‌, మహేశ్వరం వంటి చోట్ల వేల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఈ ప్రభావం తెలుగుదేశంపార్టీపై పడింది.

చాలా చోట్ల టీడీపీ విజయానికి లోక్‌సత్తా అడ్డుతగిలింది. లోక్‌సత్తా(Lok Satta Party) పోటీలో లేకపోయి ఉంటే పది, పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ గెలిచేదని ఆ పార్టీ అభిమానులు ఇప్పటికీ అంటుంటారు. కనీసం మహాకూటమిలో లోక్‌సత్తాను కలుపుకుని ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవేమో! వర్తమానానికి వస్తే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. ఒంటరిగా పోరాడితే విజయం సాధించడం కష్టమన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు.. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు.

అందుకే ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరితో పొత్తుపెట్టుకుంటూ ఉంటారు. 1999లో బీజేపీతో(BJP) పొత్తుపెట్టుకున్న చంద్రబాబు 2004లోనూ అదే పని చేశారు. 2009లో మహాకూటమిని ఏర్పాటు చేశారు. 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కారణంగానే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. అప్పుడు టీడీపీ కూటమికి- వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా స్వల్పమే! 2019లో పొత్తుల్లేకపోవడంతో ఎన్నికల్లో చతికిలపడ్డారు. ఆ పరిస్థితి మళ్లీ రాకూడదనుకున్న చంద్రబాబు ఎలాగైనా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వన్‌సైడ్‌ లవ్‌కు అవతలి నుంచి స్పందనే రావడం లేదు.

మొన్నటి వరకు పొత్తు విషయాన్ని ప్రస్తావించిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. వారాహి యాత్రలో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. చంద్రబాబు నమ్మకమంతా పవన్‌, బీజేపీలపైనే పెట్టుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జై భీమ్‌ భారత్‌ పార్టీ చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఆ పార్టీ అధినేత జడ శ్రవణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి జగన్‌కు బద్ధ వ్యతిరేకి. టీడీపీ నిస్తేజంగా ఉన్న సమయంలో కూడా అధికారపక్షంపై శ్రవణ్‌ పోరాటం చేశారు. అమరావతి రైతుల విషయంలో పోరాటం చేశారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విషయంలోనూ చేసిన న్యాయపోరాటం శ్రవణ్‌ను ఆయా వర్గాలకు దగ్గర చేసింది.

అలాగే విశాఖపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ కేసు విషయంలోనూ, చిత్తూరులో మాజీ జడ్జీ రామకృష్ణపై మంత్రి పెద్దరెడ్డి అనుచరుల దౌర్జన్యంపైనా పోరాటం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై అధికారపార్టీ నాయకుల దాడులకు సంబంధించి కూడా న్యాయపోరాటం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌గా పని చేస్తున్న దళిత యువకుడిని చంపి అతడి ఇంటి దగ్గర పడేసిన సమయంలో గళం విప్పింది శ్రవణే! ఆయన పోరాటం కారణంగా వైసీపీ ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి కేసు నమోదుకు ఆదేశించింది.

ఇవన్నీ దళిత సామాజికవర్గంలో శ్రవణ్‌పై అభిమానాన్ని పెంచాయి. జగన్‌ను గద్దెదించడమే టార్గెట్‌గా పెట్టుకున్న శ్రవణ్‌ నెమ్మదిగా నియోజవర్గాలలో క్యాడర్‌ను పెంచుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఓ ఓటుబ్యాంకును సంపాదించుకుంటున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో జై భీమ్‌ భారత్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంచెం కూడా లేవు కానీ ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చే ఛాన్సు ఉంది. 2009లో జేపీలాగే ఇప్పుడు శ్రవణ్‌ కొన్ని పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నారా? 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి- వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మధ్య తేడా కేవలం అయిదు లక్షలే! ఈ లెక్కన జడ శ్రవణ నియోజకవర్గానికి కనీసం అయిదు వేల ఓట్లు రాబట్టుకున్నా ఈ సంఖ్య ఏడు లక్షలు దాటుతుంది. ఇది కచ్చితంగా గెలుపోటములను శాసిస్తుంది.

Updated On 15 Aug 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story