Perni Nani: జైలుకు వెళ్లేందుకు సిద్ధం కానీ.. జగన్‌ను వీడేదిలేదు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. తాజాగా నాని భార్య పేర్ని జ‌య‌సుధ‌కు ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో పేర్ని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, కానీ జగన్‌ను వీడే ప్రసక్తేలేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని.. రాజ‌కీయ వేధింపుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం వ్యవస్థలను వాడుకుంటోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రేష‌న్‌బియ్యం విష‌యంలో ప్ర‌భుత్వానికి జ‌రిగిన న‌ష్టం కంటే రెట్టింపు సొమ్మును చెల్లించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. త‌మ కుటుంబంఏ తప్పు చేయలేదని కృష్ణా జిల్లా పోలీసుల‌కు తెలుస‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న భార్య జ‌య‌సుధ‌పై ఏడేళ్ల‌కు పైబ‌డిన శిక్ష ప‌డేలా సెక్ష‌న్లు నమోదు చేసి, అరెస్ట్ చేయాల‌ని చూశార‌ని ఆవేదన చెందారు. అయితే ఆ సెక్ష‌న్లు త‌న భార్య‌కు వ‌ర్తించ‌వ‌నే కార‌ణంతో జిల్లా కోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చింద‌న్నారు. ఇప్పుడు మ‌ళ్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. రేషన్‌ అక్రమ తరలింపుపై అసలు నిందితులపై కేసులు లేవని, ఒక్క తమ కుటుంబంపైనే కేసు పెట్టారని ఆరోపించారు.

ehatv

ehatv

Next Story