Village construction With The Name Of Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు మీద గ్రామ నిర్మాణం..!
కడప(Kadapa) ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) పేరు మీద గ్రామ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న మెసేజ్ ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా(YSR District) వేంపల్లె మండలం(Vempalle mandal) లో మిట్టపల్లె గ్రామస్తులకు ఆ పేరు అచ్చురావడం లేదని గ్రామస్తులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు.

Village construction With The Name Of Avinash Reddy
కడప(Kadapa) ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) పేరు మీద గ్రామ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న మెసేజ్ ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా(YSR District) వేంపల్లె మండలం(Vempalle mandal) లో మిట్టపల్లె గ్రామస్తులకు ఆ పేరు అచ్చురావడం లేదని గ్రామస్తులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి సహకారంతో నంధిపల్లె సమీపంలో కొత్త గ్రామ నిర్మాణంకు జెడ్పిటిసి రవి కుమార్ రెడ్డి(Ravi Kumar Reddy) శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో గ్రామాన్ని పూర్తి చేసి అవినాష పురంగా(Avinashpuram) గ్రామస్థులు నామకరణం చేయనున్నారు. ఇది వైరల్ అవుతున్న మెసేజ్ యొక్క సారాంశం.
ఎంపీ అవినాష్ రెడ్డి కడప నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో అవినాష్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది.
