Arasavili Rathasaptami : అరసవిల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఉన్న అరసవిల్లి(Arasavili) శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం లో రథసప్తమి(Rathasaptami) వేడుకలు ఘనంగా జరిగాయి. అర్థరాత్రి క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు జరిపారు. వేలాది మంది భక్తులు సూర్యనారాయణ స్వామి(Suryanaryana Swamy) నిజరూప దర్శనం చేసుకుని పులకించిపోయారు. తెలుగు రాష్ట్రాలలో సూర్యభగవానుడి ఆలయం అంటే టక్కున గుర్తుకొచ్చేది అరసవిల్లి ఆలయమే! ఇక్కడి స్వామిమూర్తిని ఇంద్రుడు ప్రతిష్టించాడట! అలాగని స్కంధపురాణంలో ఉంది.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఉన్న అరసవిల్లి(Arasavili) శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం లో రథసప్తమి(Rathasaptami) వేడుకలు ఘనంగా జరిగాయి. అర్థరాత్రి క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు జరిపారు. వేలాది మంది భక్తులు సూర్యనారాయణ స్వామి(Suryanaryana Swamy) నిజరూప దర్శనం చేసుకుని పులకించిపోయారు. తెలుగు రాష్ట్రాలలో సూర్యభగవానుడి ఆలయం అంటే టక్కున గుర్తుకొచ్చేది అరసవిల్లి ఆలయమే! ఇక్కడి స్వామిమూర్తిని ఇంద్రుడు ప్రతిష్టించాడట! అలాగని స్కంధపురాణంలో ఉంది. పురాణగాధలను పక్కన పెట్టి చారిత్రక కథనాల విషయానికి వస్తే అరసవిల్లి దేవాలయాన్ని క్రీస్తుశకం ఏడో శతబ్దంలో నిర్మించారు. క్రీస్తుశకం 627 నుంచి 702 మధ్య కాలంలో గంగ వంశానికి చెందిన గుణార్నవుని కుమారుడు దేవేంద్రవర్మ ఈ సూర్యాలయాన్ని నిర్మించారు. 11 శతాబ్దంలో అనంతదేవవర్మ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. మధ్యలో అన్యమతస్తుల దాడిలో ఆలయం దెబ్బతింది.
దాడుల సంగతి తెలిసే కొందరు మూల విరాట్‌ను ఆలయ ప్రాంగణంలోని ఓ బావిలో భద్రపరిచారట! కొన్నాళ్ల తర్వాత అంటే 1778లో సీతారామస్వామి అనే భక్తుడు ఆలయాన్ని పునర్నిర్మించారు. 1999లో వరుదు బాబ్జీ అనే వ్యక్తి ఓఢ్ర శైలిలో ఆలయాన్ని పునరుద్ధరించారట! అరుణ వర్ణంతో ఉన్న ఏకశిలపై సూర్యదేవుని విగ్రహాన్ని మలిచారు. అనూరుడు సారథ్యంలో ఏడు గుర్రాల రథం, దానిపై ఉష, పద్మిని రూపాలు.స్వామి పాదాల దగ్గర ఛాయాదేవి రూపం. రెండు హస్తాలతో కూడిన స్వామివారి విగ్రహంపైన సనక సనంద మునుల ఆకృతులను కూడా చూడవచ్చు. సనకుడేమో వింజామరలు వీస్తుంటాడు. సనందుడేమో ఛత్రం పడుతుంటాడు. ద్వారపాలకులుగా మాతరుడు, పింగళుడి మూర్తులను అమర్చారు. సూర్యనారాయణుడి నడుమ దగ్గర సూర్యకఠారి అనే చురకత్తి అలంకారికంగా వుంది. ఉత్తరాయణ సమయంలో మార్చి ఎనిమిది నుంచి పదకొండు వరకు నాలుగు రోజుల్లో తొలి సూర్యోదయ కిరణాలు స్వామి పాదాలపై పడతాయి. అలాగే దక్షిణాయన సమయంలో అక్టోబర్ ఒకటి నుంచి నాలుగు వరకు తొలి సూర్య కిరణాలు పాదలపై పడతాయి. అపురూప ఘట్టాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు వస్తారు. క్షేత్రాన్ని సందర్శించి మండలం రోజుల పాటు సూర్య నమస్కారాలు చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి మాఘ, మఖ, కార్తీక మాసాలలో ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఇక చైత్రశుద్ధి ఏకాదశి నాడు స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. ఉత్సవాల సంగతి చెప్పనే అక్కర్లేదు.మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమిని ఇక్కడ వైభవంగా జరుపుతారు.