Acb Court Judge Hima Bindu : జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్
విజయవాడ ఏసీబీ సీఐడీ జడ్జి(ACB CID Judge) హిమబిందుపై(Hima Bindu) సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోండని ఏపీ సీఎస్(AP CS) కు రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) కార్యదర్శి పీసీ మీనా(PC Meena) ఆదేశాలు జారీ చేశారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుకి వివరించాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
విజయవాడ ఏసీబీ సీఐడీ జడ్జి(ACB CID Judge) హిమబిందుపై(Hima Bindu) సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోండని ఏపీ సీఎస్(AP CS) కు రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) కార్యదర్శి పీసీ మీనా(PC Meena) ఆదేశాలు జారీ చేశారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుకి వివరించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. చంద్రబాబు రిమాండ్(Chandrababu Remand) తర్వాత జడ్జి హిమబిందును కించపరుస్తూ టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా.. చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ జవహార్ రెడ్డిని ఆదేశించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ సంచలనం సృష్టించింది. నిధులు గోల్ మాల్ చేశారని ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ పోలీసులు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి హిమబిందు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటి నుంచి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.