నల్లమల అడవుల్లో అనేక వింతైన జీవులు, విచిత్రమైన ప్రాణులు ఉన్నాయి. తిరుమల కొండ కూడా నల్లమలలో భాగమే కాబట్టి అక్కడా అప్పుడప్పుడు ఆకస్మాత్తుగా వింత జీవులు ప్రత్యక్షమవుతాయి. లేటెస్ట్‌గా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో ఓ అరుదైన జీవి కనిపించింది. ఈ అరుదైన జీవిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏడు కొండలలో నామాల తొండ దర్శనమిచ్చింది.

నల్లమల అడవుల్లో అనేక వింతైన జీవులు, విచిత్రమైన ప్రాణులు ఉన్నాయి. తిరుమల కొండ కూడా నల్లమలలో భాగమే కాబట్టి అక్కడా అప్పుడప్పుడు ఆకస్మాత్తుగా వింత జీవులు ప్రత్యక్షమవుతాయి. లేటెస్ట్‌గా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో ఓ అరుదైన జీవి కనిపించింది. ఈ అరుదైన జీవిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏడు కొండలలో నామాల తొండ దర్శనమిచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ అరుదైన తొండను గుర్తించినట్టు అటవీ శాఖ సిబ్బంది వెల్లడించారు. ఫారెస్ట్ లిజార్డ్ గా పిలుచుకునే ఈ నామాల తొండ అలిపిరి సమీపంలో ఓ రాతిబండపై దర్శనమిచ్చింది. నిగనిగలాడే నల్లని శరీరం.. వెన్నె పూస మీద తెల్లని నామం దిద్ది, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్లు అందంగా ఉంది.. ఈ అరుదైన అడవి తొండలు ఎక్కవగా రాతి కొండలు ఉన్న అడవుల్లోనే కనిపిస్తాయి.

Updated On 30 Jun 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story