Raptadu Siddham: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభ
మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపు
రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్‌సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు లక్షలాది మంది జనం వచ్చారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిలో ఎస్కే యూనివర్సిటీ దాటి సంజీవపురం వరకు 12 కిలోమీటర్ల పొడవునా, ఇటు రాప్తాడు వైపు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరూరు టోల్‌గేట్, మరో వైపు రాప్తాడు నుంచి అనంతపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి.
మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపు వాహనాల్లో జనం వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రాంగణానికి చేరుకోలేక పెద్ద సంఖ్యలో మధ్యలో నిలిచిపోయారు. ప్రభంజనం అంటే ఇలాగే ఉంటుంది.. ఎల్లో మీడియా కూటమి విషప్రచారం చేస్తున్నా.. గొప్ప నాయకుడిని మాత్రం చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాలన్నీ జగనన్న దెబ్బకు మంచుకొండల్లా కరిగిపోతాయని.. రానున్న ఎన్నికల కోసం కౌరవులందరూ గుంపులుగా వస్తుంటే జగనన్న మాత్రం సింగిల్‌గా వస్తున్నారని ఉషశ్రీ చరణ్ అన్నారు.