అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని మనం కాదనలేమన్నారు రాపాక. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో

రాపాక వరప్రసాద్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపించారు. వైసీపీ అధిష్ఠానం ఆయనకు అమలాపురం ఎంపీ టికెట్టు ఇచ్చింది. దీనిపై ఆయన స్పందించారు.. తాను రాజోలులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని అన్నారు. రాజోలు టిక్కెట్టు దక్కించుకున్న గొల్లపల్లి సూర్యారావుకు గెలుపు అంత సులభం కాదని తేల్చి చెప్పారు. వైసీపీ అధిష్ఠానం తనకు అమలాపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వడంపై కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక ఇక చేసేదేం లేదని, తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజోలులో గెలుపునకు కచ్చితంగా తామంతా కృషి చేస్తామన్నారు.

అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని మనం కాదనలేమన్నారు రాపాక. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలీదు కానీ కార్యకర్తలు మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. ఆశించింది జరక్కపోతే నిరుత్సాహం సహజమే.. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఈ నాలుగు సంవత్సరాలు కార్యకర్తలు తన వెంటే ఉన్నారన్నారు. కలిసిమెలిసి అనేక కార్యక్రమాలు చేశామని.. కాబట్టి మా మధ్య అనుబంధం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ వర్క్ చేసుకున్నానని వివరించారు.

Updated On 13 March 2024 11:43 PM GMT
Yagnik

Yagnik

Next Story