Ramoji Rao Health Condition : రామోజీరావుకు తీవ్ర అనారోగ్యం.. అసలేం జరిగింది..!
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తీవ్ర అనారోగ్య బారినపడినట్లు తెలుస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమ వ్యవహారాలు జరిగాయన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.. అయితే తాజాగా వాటికీ సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు మార్గదర్శి యాజమాన్యానికి కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం మార్గదర్శి సమస్త నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామోజీరావును ఏ1గా, ఆమె కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏ2గా ఛార్జ్ షీట్లో చేర్చింది సీఐడీ..
రామోజీ గ్రూప్(Ramoji Group) సంస్థల చైర్మన్ రామోజీరావు(Ramoji Rao) తీవ్ర అనారోగ్య బారినపడినట్లు తెలుస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(margadarshi chit funds) లో అక్రమ వ్యవహారాలు జరిగాయన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.. అయితే తాజాగా వాటికీ సంబంధించి ఏపీ సీఐడీ(AP CID) అధికారులు మార్గదర్శి యాజమాన్యానికి కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం మార్గదర్శి సమస్త నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామోజీరావును ఏ1గా, ఆమె కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్(Sailaja Kiran) ను ఏ2గా ఛార్జ్ షీట్లో చేర్చింది సీఐడీ.. అంటే కాకుండా కొన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ ల మేనేజర్లపై కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని శైలజా కిరణ్ ఇంట్లో సీఐడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే రామోజీరావుని ప్రశ్నించడానికి వెళ్లిన సీఐడీ ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రశ్నించకుండానే వెనుదిరిగింది.
రామోజీరావుకి అనారోగ్య వార్తలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. తప్పు ఎక్కడబయటపడుతుందో అనే భయంతోనే ఇలాంటి దొంగ నాటకాలు రామోజీరావు ఆడుతున్నారని వాళ్ళు వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో గత వారం రామోజీరావు, శైలజ కిరణ్ లకు సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ .