Complaint Against Varma: రామ్‌గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్.. మహిళా కమిషన్లో కేసు
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష (Karne Shirisha) సీరియస్ అయ్యారు. తనపై అవాకులు చవాకులు మాట్లాడినందుకు వర్మపై మహిళాకమిషన్‌లో కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal varma) వ్యూహం (Vyuham) అనే సినిమా తీశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బర్రెలక్కపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష (Karne Shirisha) సీరియస్ అయ్యారు. తనపై అవాకులు చవాకులు మాట్లాడినందుకు వర్మపై మహిళాకమిషన్‌లో కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal varma) వ్యూహం (Vyuham) అనే సినిమా తీశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బర్రెలక్కపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. బర్రెలక్క ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేశారు. జోరుగా ప్రచారం చేశారు. యువత మద్దతును కూడగట్టుకున్నారు. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. అయితేనేమీ ఆమె సుమారు ఆరు వేల ఓట్లను సంపాదించుకున్నారు. ఓడిపోయినా రాజకీయాలలో మాత్రం ఆమె చర్చనీయాంశమయ్యారు. ఈ నేపథ్యంలోనే వర్మ కొన్ని కామెంట్లు చేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కల్యాణ్ పార్టీకి (Pawan kalyan Party) రాలేదని విమర్శించారు. ఇక్కడితో ఆయన ఆగితే బాగుండేది. కానీ ఇంకొన్ని మాటలన్నారు. 'ఊరుపేరు లేని ఆమె (బర్రెలక్క) చాలా ఫేమస్ అయ్యారు. బర్రెలెక్క కాస్త ఉంటుంది. బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు' అని వర్మ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని శిరీష తరపు న్యాయవాది అన్నారు. 'రామ్‌గోపాల్ వర్మ .. నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలింస్ (Blue Films) తీసుకుని బతుకు . కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు' అని అన్నారు. ఈ విషయంపై మరింత పోరాటం చేస్తామన్నారు. ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమికొడతాం అని వర్మను హెచ్చరించారు.