Ramachandrapuram : రామచంద్రపురంలో చెల్లుబోయినకు చెల్లు..తెరపైకి పిల్లి సూర్యప్రకాష్ !
రామచంద్రపురం(Ramachandrapuram) వైసీపీ పార్టీలో మంత్రి చెల్లుబోయిన..ఎంపీ బోస్ ఆధిపత్య పోరుకు తెరపడింది. రామచంద్రపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేనుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ కు మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే రాజమండ్రి రూరల్(Rajahmundry rural) ఇంచార్జీగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla buchaih chowdary) ఉన్నారు. ఈ దఫా ఆ సీటు జనసేనకు(Janasena) ఇచ్చే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. ఈనేపథ్యంలో అక్కడ టీడీపీ-జనసేనకు ధీటైన ప్రత్యర్థిగా మంత్రి చెల్లుబోయినను సీఎం జగన్ ఎంపీక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రామచంద్రపురం(Ramachandrapuram) వైసీపీ పార్టీలో మంత్రి చెల్లుబోయిన..ఎంపీ బోస్ ఆధిపత్య పోరుకు తెరపడింది. రామచంద్రపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేనుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ కు మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే రాజమండ్రి రూరల్(Rajahmundry rural) ఇంచార్జీగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla butchaih chowdary) ఉన్నారు. ఈ దఫా ఆ సీటు జనసేనకు(Janasena) ఇచ్చే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. ఈనేపథ్యంలో అక్కడ టీడీపీ-జనసేనకు ధీటైన ప్రత్యర్థిగా మంత్రి చెల్లుబోయినను సీఎం జగన్ ఎంపీక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల రామచంద్రపురం టికెట్ కోసం మంత్రి చెల్లుబోయిన వేనుగోపాలకృష్ణ(Chelluboyina venugopalakrishna), ఎంపీ బోస్ మధ్య రాజకీయ రగడ రచ్చకెక్కింది. రామచంద్రపురం పార్టీలో అసమ్మతి పోరు పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఒకరు పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడుకాగా..మరొకరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్, ప్రస్తుతం మంత్రి. గతంలో రామచంద్రపురం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్..(Pilli subash chandrabose) 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మండపేట నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. రామచంద్రపురంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దింపింది వైసీపీ అధిష్టానం. అయితే ఆ ఎన్నికల్లో మండపేటలో బోస్ ఓడిపోగా.. రామచంద్రపురంలో చెల్లుబోయిన నెగ్గడం జరిగిపోయింది.
రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయినకు బోస్ వర్గీయుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈసారి తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఈ వ్యవహారం అక్కడ బాగా ముదిరడంతో పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే మొదటి నుంచి తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌కు(Pilli suryaprakash) అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇప్పటి నుంచో అడుగుతున్నారు ఎంపీ బోస్. ఇటీవల రామచంద్రపురంలో సమావేశమైన బోస్ వర్గీయులు..చెల్లుబోయినకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని అధిష్టానానికి పరోక్షహెచ్చరికలు పంపారు. గత ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన గెలుపొందగా..మంటపేట నుంచి పోటీ చేసి పోడిపోయారు సుభాష్ చంద్రబోస్. అయినా పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ (CM Jagan)వెంటే నడిచిన బోస్‌ను ఎమ్మెల్సీ చేసి..మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎంపీని చేసి.. అదే సామాజిక వర్గానికి చెందిన వేణుకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు(Tota trimurthulu) వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనను మండపేట ఇంఛార్జీగా నియమించారు. దీంతో బోస్‌కు ఏ నియోజకవర్గంలోనూ చోటు దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్‌కు మార్చి.. అక్కడి నుంచి బోస్ తనయుడికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అక్కడ అసమ్మతి సర్వమే నెగ్గిందన్నమాట. మరి..చెల్లుబోయిన వర్గాన్ని పిల్లి వర్గం ఎలా కలుపుకుపోతుందో చూడాలి.