Ram Gopal Varma :ఏడాది కిందటి పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడమేమిటో?
ఏడాది కిందట సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులపై ఇప్పుడు హఠాత్తుగా కొందరి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో
ఏడాది కిందట సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులపై ఇప్పుడు హఠాత్తుగా కొందరి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో అర్థంకావడం లేదంటున్నారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. పత్రికల్లో ప్రచురించే కార్టున్లలాగే తాను కూడా కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేశానని, పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చునని, ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు సరికదా, ఆ పోస్టుల్లో తాను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదని రామ్‌గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు. 'కానీ హఠాత్తుగా ఏడాది తర్వాత అది కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్టడం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.