Gorantla: గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏమిటో?
ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుల్లో ఊహించని నిరాశ నెలకొంది. ఇంతలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. జనసేన అభ్యర్థిగా చెబుతున్న కందుల దుర్గేష్.. బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నామని రాజమండ్రి సమావేశంలో పవన్ కళ్యాణ్ తమతో చెప్పినట్లు దుర్గేష్ అంటున్నారు. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా అది ఓట్లుగా మలుచుకోవాలని.. సమావేశంలో ఎన్నికల మేనేజ్మెంట్ గురించి పవన్ దిశానిర్దేశం చేశారన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్లను కలుపుకుని వెళ్లాలని పవన్ సూచించారన్నారు.
ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుల్లో ఊహించని నిరాశ నెలకొంది. ఇంతలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 'రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి.. టీవీ న్యూస్‌లలో, వాట్సాప్‌లలో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం.. అవి నమ్మి భావోద్వేగాలకు గురి అవ్వొద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా "గోరంట్ల" పోటీ లో ఉంటారు.. దీంట్లో ఏటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తొందరలో నారా చంద్రబాబు నాయుడు గారిచే అధికారిక ప్రకటన ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీ కంచుకోటల్లో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ప్రభంజనంగా వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి. అక్కడ్నించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా గెలవాలని గోరంట్ల అనుకుంటున్నా కూడా జనసేన రూపంలో ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి దారెటో తెలియాల్సి ఉంది.