Chandrababu Health Bulletin : నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు హెల్త్ బులిటిన్ ను వైద్యాధికారులు విడుదల చేశారు.

Rajahmundry Central Jail Officials Released Chandrababu Naidu Health Bulletin
రాజమండ్రి జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీటా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హెల్త్ బులిటిన్(Health Bulletin) ను అధికారులు విడుదల చేశారు. కోర్టు ఆదేశాలతో టవర్ ఏసీ(Tower AC) ఏర్పాటుచేశామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన 67 కేజీల బరువు(Weight) ఉన్నారని, బీపీ 140/80, పల్స్ 70/మినిట్, రెస్పిరేటరీ రేటు 12/ మినిట్ ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు చర్మ(Skin) సంబంధిత సమస్యతో ఇబ్బందిపడటంతో డాక్టర్లు(Doctors) ఇచ్చిన రిపోర్ట్(Report) ఆధారంగా లాయర్లు ఏసీబీ కోర్టు(ACB Court)ను ఆశ్రయించారు. దీంతో చంద్రబాబు ఉన్న బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు వెంటనే చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో టవర్ ఏసీని ఏర్పాటు చేశారు.
