తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. అప్పుడప్పుడు ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఇతర తీవ్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నిన్న హైదరాబాద్‌లో గణనీయమైన వర్షపాతం నమోదైంది.. గోల్కొండలో అత్యధికంగా 42.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మొత్తం మీద అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం అల్లూరి, కృష్ణా, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో వానలు పడొచ్చు. అలాగే.. నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story