పశ్చిమ బెంగాల్ ,మధ్య ప్రదేశ్ ,జార్ఖండ్ ,ఛత్తీస్గఢ్ ,రాజస్థాన్ మీదగా ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావం తోతేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఈ ప్రభావం రాష్ట్రము పైన ఉండటం తో శని ఆదివారాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని చెప్పటం జరిగింది.

గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తం గా వాతావరణం పూర్తిగా మారిపోయింది . బయటకు రావాలంటే ఎండకు భయపడుతున్న సమయంలో అకాల వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయని చెప్పచు. కొన్ని ప్రాంతాల్లో పడిన వడగండ్ల వానతో ఒక్కసారి తెలంగాణ లో కాశ్మీర్ తరహా సుందర దృశ్యాలు నెలకొన్నాయి . ఇదే క్రమంలో మరో రెండుల రోజుల పాటు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది రాష్ట్ర వాతవరణ శాఖ తెలిపింది . పశ్చిమ బెంగాల్ ,మధ్య ప్రదేశ్ ,జార్ఖండ్ ,ఛత్తీస్గఢ్ ,రాజస్థాన్ మీదగా ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావం తోతేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఈ ప్రభావం రాష్ట్రము పైన ఉండటం తో శని ఆదివారాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని చెప్పటం జరిగింది.

మరో వైపు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి తమిళనాడు మీదుగా రాయలసీమ ,తెలంగాణ ,విదర్భ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావం తో తెలంగాణాలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది . సముద్రమట్టానికి 0. 9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావం తో వర్షాలతో పాటు ఉరుములు,మెరుపులు ,ఎదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది వాతవరణ శాఖ . గంటలు 30 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని ,వడగళ్లతో కొన్ని చోట్ల భారీవర్షం పడే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది .

ఆంధ్రప్రదేశ్ లో కూడా ద్రోణి ఉపరితల ఆవర్తనాలు వలన గత మూడు రోజులగా అక్కడక్కడా చెదురు మదురు జల్లులు పడుతున్నాయి . మరో మూడు రోజులపాటు పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది రాష్ట్ర వాతవరణ శాఖ . మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అకాలంగా కురిసే వర్షాల,భారీ పిడుగులా ప్రభావం తో రైతులు మాత్రం అనుకోని నష్టాన్నిచూస్తున్నారు .

Updated On 18 March 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story