Rain Alert : ఏపీకి భారీ వర్ష హెచ్చరిక..!
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అర్ధరాత్రి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అర్ధరాత్రి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడతాయని.. మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ప్రజలను అలర్ట్ చేసింది. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.