ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఐదు రోజుల పాటూ వర్షం భారీగా కురిసే అవకాశం ఉందని అంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఐదు రోజుల పాటూ వర్షం భారీగా కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆగస్టు 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉత్తర కోస్తా, యానాంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐదు రోజులూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గంటకు 40 కిమీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం ఉత్తర కర్ణాటకలో ఏర్పడిన తుఫాను ఇప్పుడు రాయలసీమ, పరిసరాల్లో ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ మేర విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story