ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 6 వ తేదీ నుండి పలుప్రాంతాల్లో వర్ష సూచన ఉందని పేర్కొంది . ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం తో పాటు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు మార్చి 18 వ తేదీ వరకు ఉరుములు,వడగళ్లతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది . గత నెల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత పెరిగింది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చల్లటి కబురు ఇచ్చింది . తేమ పొడిగాలుల కలయిక వలన భారీ ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షలకు గల కారణం అని తెలిపింది .

ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 6 వ తేదీ నుండి పలుప్రాంతాల్లో వర్ష సూచన ఉందని పేర్కొంది . ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం తో పాటు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని,ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా ఉంది . ఈ ఈ నెల 16, 17 తేదీల్లో కూడా వర్షాలు పడనున్నాయి . 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటుందనే అంచనా వేశారు.
ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులు ఉండనున్నాయి.

Updated On 14 March 2023 3:43 AM GMT
Ehatv

Ehatv

Next Story