Vijayanagram Trains Accident : ఏపీ రైలు ప్రమాదం.. 33 రైళ్లు రద్దు.. 6 రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విజయనగరంలో(Vijayanagaram) రెండు రైళ్లు(Trains) ఢీకొన్న దుర్ఘటనలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం కారణంగా రైల్వే శాఖ 33 రైళ్లను రద్దు చేయడంతో పాటు ఆరు రైళ్లను రీషెడ్యూల్(Trains Reschedule) చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విజయనగరంలో(Vijayanagaram) రెండు రైళ్లు(Trains) ఢీకొన్న దుర్ఘటనలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం కారణంగా రైల్వే శాఖ 33 రైళ్లను రద్దు చేయడంతో పాటు ఆరు రైళ్లను రీషెడ్యూల్(Trains Reschedule) చేసింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
వాల్తేర్ డివిజన్‌లోని కంటకపల్లె, అలమనాడ స్టేషన్‌ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో.. మొత్తం 33 రైళ్లను రద్దు చేశామని, 24 రైళ్లను దారి మళ్లించామని, 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి బిశ్వజిత్ సాహు ధృవీకరించారు.
ఇందులో మూడు రైళ్లను రద్దు చేశామని, రెండు రైళ్లను ఈ ఉదయం రీషెడ్యూల్ చేశామని తెలిపారు. చెన్నై సెంట్రల్ నుండి పూరీ (22860), రాయగడ నుండి గుంటూరు (17244), విశాఖపట్నం నుండి గుంటూరు (17240) రద్దు చేయగా.. చెన్నై సెంట్రల్ నుండి షాలిమార్ (12842), అలెప్పి నుండి ధన్‌బాద్ (13352) ఈరోజు రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
“విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు.
14 రైళ్లు రద్దు..అయిదు రైళ్ల దారి మళ్లింపు
విజయనగరంలో సంభించిన రైలు ప్రమాదం దృష్ట్యా కొన్ని రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్ల రాకపోకలను మళ్లించారు.
రద్దైన రైళ్ల వివరాలు
30 అక్టోబర్ – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – రాయ్‌పూర్ నుండి – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్
29 అక్టోబర్ – గుణుపూర్ నుండి – గుణుపూర్-విశాఖపట్నం స్పెషల్
29 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్
29 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్
29 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-పారాదీప్ ఎక్స్‌ప్రెస్