సంక్రాంతి(Sankranti) రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను(Trains) నడపనున్నట్లు రైల్వేశాఖ(Railway Department) ప్రకటించింది. ఈ రైళ్లు కాచీగూడ(Kachiguda) నుంచి కాకినాడ(Kakinada), హైదరాబాద్‌ నుంచి తిరుపతి(Tirupati) మధ్య తిరగనున్నాయి. విజయవాడ మీదుగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609) నడవగా.. జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610) రైలు నడవనుంది.
హైదరాబాద్-తిరుపతి (07509) డిసెంబర్ 28, జనవరి 4,11,18, 25 తేదీల్లో నడవగా.. తిరుపతి – హైదరాబాద్ (07510) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుపుతారు.
కాచిగూడ-కాకినాడ టౌన్ (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడవగా.. కాకినాడ టౌన్ – కాచిగూడ (07654) డిసెంబర్ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో నడుపుతారు
తిరుపతి-సికింద్రాబాద్ (07481) సర్వీసు జనవరి 7 నుంచి 28 వరకు నడవగా..సికింద్రాబాద్ – తిరుపతి (07482) సర్వీసు జనవరి 8 నుంచి 29 వరకు నడుపుతారు.
హైదరాబాద్-నర్సాపూర్ (07631) సర్వీసు జనవరి 6 నుంచి 24 వరకు నడవగా.. నర్సాపూర్ – హైదరాబాద్ (07632) సర్వీసు జనవరి 7 నంచి 28 వరకు నడుపుతారు.
కాకినాడ టౌన్ – లింగంపల్లి (07445) సర్వీసు జనవరి 1 నుంచి నడవగా.. లింగంపల్లి – కాకినాడ టౌన్ (07446) సర్వీసు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడుపుతారు

Updated On 22 Dec 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story