Priyanka Gandhi : రాయ్‌బరేలీకే రాహుల్ జై... వాయనాడ్‌లో ప్రియాంక?
కాంగ్రెస్ పార్టీ(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi) పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. ఇప్పుడాయన కేరళలోని(Kerala) వయనాడ్‌ను(Wayanad) వదులుకుంటారా? లేకపోతే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీనా?(Rae Bareli) అన్నది ఆసక్తిగా మారింది. రెండుచోట్లా ఆయన మూడు లక్షల ఓట్ల పై చిలుకు మెజారిటీని సాధించారు. రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట! మరోవైపు వయనాడ్ ప్రజలు రాహుల్‌ను అక్కున చేర్చుకున్నారు. కిందటి ఎన్నికల్లో అమేథీ ప్రజలు రాహుల్‌ను తిరస్కరించినా వయనాడ్ ప్రజలు ప్రేమతో భారీ మెజారిటీని కట్టబెట్టి గెలిపించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi) పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. ఇప్పుడాయన కేరళలోని(Kerala) వయనాడ్‌ను(Wayanad) వదులుకుంటారా? లేకపోతే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీనా?(Rae Bareli) అన్నది ఆసక్తిగా మారింది. రెండుచోట్లా ఆయన మూడు లక్షల ఓట్ల పై చిలుకు మెజారిటీని సాధించారు. రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట! మరోవైపు వయనాడ్ ప్రజలు రాహుల్‌ను అక్కున చేర్చుకున్నారు. కిందటి ఎన్నికల్లో అమేథీ ప్రజలు రాహుల్‌ను తిరస్కరించినా వయనాడ్ ప్రజలు ప్రేమతో భారీ మెజారిటీని కట్టబెట్టి గెలిపించుకున్నారు. మరి ఇప్పడు ఏ నియోజకవర్గాన్ని వదులుకోవడం? వయనాడ్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎస్టీ రిజర్వుడు సీట్లు అయితే, ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. వయనాడ్ నియోజకవర్గంలో క్రైస్తవ(christians), ముస్లిం(Muslims) మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(UDF) ఇక్కడ బలంగా ఉంది. మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి రాహుల్ పోటీ చేస్తే, సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ నుచి కె.సురేంద్రన్ పోటీ చేశారు. ఈ ఇద్దరూ తక్కువవారేం కాదు. రాహుల్ రాయ్‌బరేలీలో గెలిస్తే ఆయన వయనాడ్‌ను వదిలేసుకుంటారని ప్రత్యర్థులు విపరీతంగా ప్రచారం చేశారు. రాహుల్‌గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆయనకే ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్పుకుంది. పైగా గత అయిదేళ్లలో రాహుల్‌గాంధీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రజలు ఆయనను మళ్లీ గెలిపించుకున్నారు. 2019లో కూడా రాహుల్ అటు అమేథీ నుంచి ఇటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయిన రాహుల్‌కు వయనాడ్ విజయాన్ని ప్రసాదించింది. కొన్ని దశాబ్దాలుగా రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటోంది.
1951 నుంచి ఈ నియోజకవర్గంలో మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. సోనియాగాంధీ(Sonia Gandhi) ఇక్కడి నుంచి అయిదుసార్లు విజయం సాధించారు. అలాంటి రాయ్‌బరేలీని వదులుకోవడానికి రాహుల్ ఇష్టపడటం లేదు. ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలకు గుండె వంటింది. అలాంటి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతున్నది. ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెల్చుకుంది. రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాహుల్ అనుకుంటున్నారట! వాయనాడ్‌ను వదులుకుంటే అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి ఆ స్థానం నుంచి ప్రియాంకగాంధీని(Priyanka Gandhi) బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నది. అందుకే ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదట! ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే ప్రియాంక పోటీ చేస్తారని ఆమధ్యన కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ దిగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు!