కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా(Special Status) ఇస్తామని గతంలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే! అయితే కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం నుండి దిగిపోయాక ఎన్.డి.ఏ. ప్రభుత్వం(NDA) అధికారం లోకి వచ్చింది. అయితే ఎన్.డి.ఏ. ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ మాత్రం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పెషల్ స్టేటస్ వద్దు.. స్పెషల్ ప్యాకేజీ(Special Package) కావాలంటూ చేసిన డీలింగ్ కారణంగానే తాము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నామని బీజేపీ(BJP) నేతలు వివరణ ఇచ్చారు.

తాజాగా కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(GauravGogoi) పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చిందని.. అది నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఆయనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ కు UPA ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం చేసి యిచ్చిన #ప్రత్యేకతరగతిహోదాను మోదీ గారి నేత్రుత్వంలోని కేంద్రప్రభుత్వం అమలుపరచకపోవడం పై బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఖండిస్తూ,తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ శ్రీ @GauravGogoiAsm గారికి ధన్యవాదములు" అంటూ పోస్టు పెట్టారు.

Updated On 3 Feb 2024 1:15 AM GMT
Yagnik

Yagnik

Next Story