Raghuveera Reddy : 25 మంది ఎంపీలు ఈ ఐక్యతతోనే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురండి
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకూ లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీ కాగా.. ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
The 25/25 MPs from our state are clearly on the same line in supporting the speaker candidate proposed by NDA.
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) June 26, 2024
With such unity, I hope they can achieve the special status for the state, address the issues in the Reorganization Act, and work towards the development of the state.
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాఫిక్‌గా మారింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో వైసీపీ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నట్లు ప్రకటించిన వైసీపీ నిర్ణయంతో రాష్ట్రంలోని 25కు 25 మంది ఎంపీలు ఎన్డీఏ అధికార కూటమికే మద్దతు ప్రకటించినట్లైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈ విషయమై స్పందిస్తూ.. ఎన్డీయే ప్రతిపాదించిన లోక్‌సభ స్పీకర్ అభ్యర్థికి మద్దతివ్వడంలో మన రాష్ట్రానికి చెందిన 25కు 25 మంది ఎంపీలు స్పష్టంగా ఒకే లైన్‌లో ఉన్నారు. అలాంటి ఐక్యతతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగలరని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.