Raghuveera Reddy : మళ్లీ మెరిసిన రఘువీరా.. ఈ సారి కొడుకుతో సహా సీఎంతో భేటీ..!
ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైన రఘువీరా.. కొద్దికాల క్రితమే రాజకీయంగా యాక్టివ్ అయ్యారు.

Raghuveera Reddy Meet Karnataka CM Siddaramaiah Along With His Son
ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైన రఘువీరా.. కొద్దికాల క్రితమే రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ప్రచార బాధ్యతలను అప్పగించడంతో మళ్ళీ రాజకీయ వేదికపై మెరిశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అడపాదడపా రాజకీయలకు సంబంధించి పోస్టులు పెడుతున్నారు.
తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah)ని రఘువీరా రెడ్డి, ఆయన కుమారుడు అమిత్ రఘువీరా(Amit Raghuveera) కలిశారు. మర్యదపూర్వక భేటీగా రఘువీరా రెడ్డి సోషల్ మీడియాలో వెల్లడించారు. అయినప్పటికీ ఈ భేటీకి సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. అనంతపురం(Ananthapuram) జిల్లా కర్ణాటక(Karnataka) సరిహద్దు ప్రాంతం కావడంతో.. కొడుకును కన్నడ రాజకీయాలకు పరిచయం చేయాలనుకుంటున్నారా..? లేదంటే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోనే యాక్టివ్ అవుదామనుకుంటున్నారా అనే ఊహాగానాలు సందడి చేస్తున్నాయి.
