ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ 2024, జూన్ 10వ తేదీ సోమవారం గుంటూరు పోలీస్ స్టేషన్ లో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో తెలిపారు. తనను హింసించడమే కాకుండా తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన గుంటురు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ హత్యాయత్నానికి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో తెలిపారు. అప్పటి సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచారు రఘురామ. ఆ తర్వాత వైసీపీని వీడారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.

Updated On 10 Jun 2024 11:06 PM
Yagnik

Yagnik

Next Story