Raghurama vs Vishnu: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై రఘురామ కామెంట్లు
తనకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్ధన్ రెడ్డి అధిష్ఠానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని
ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన ఎంపీగా బరిలో దిగాలని అనుకుంటున్నారు. అయితే అది వైసీపీ టికెట్ మీద కాదనుకోండి. భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పిన రఘురామ.. తాజాగా బీజేపీ నేత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పై కీలక కామెంట్లు చేశారు. ఆయన తనకు టికెట్ రాకుండా విష్ణు వర్ధన్ రెడ్డి అడ్డుపడుతూ ఉన్నారని ఆరోపించారు.
తనకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్ధన్ రెడ్డి అధిష్ఠానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని.. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని అన్నారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి విష్ణు అస్త్రాన్ని వాడారని.. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డిది కదిరి.. నాది నరసాపురం.. నా నియోజకవర్గంతో విష్ణువర్ధన్ కు ఏం పని? అని ప్రశ్నించారు. నాకు టికెట్ వస్తుంటే జగన్ కు భయం పట్టుకుందని రఘురామ ఆరోపించారు. బీజేపీకి ఇచ్చిన 6 స్థానాల్లో నరసాపురం కూడా ఉంటుంది. వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నాడో తెలియడం లేదన్నారు రఘురామ.