వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తాన‌న్న ఆయ‌న‌..

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. నరసాపురం(Narasapuram) లోక్ సభ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తాన‌న్న ఆయ‌న‌.. టీడీపీ(TDP), జనసేన(Janasena) అభ్యర్థిగా బ‌రిలో ఉంటాన‌ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథాకానికి జగన్ ఆయన పేరునో లేదో ఆయన తండ్రి పేరునో పెట్టుకుంటున్నారని సీఎం జ‌గ‌న్‌(CM Jagan)పై విమర్శలు గుప్పించారు. పీఎం కిసాన్(PM Kisan) పథకానికి వైఎస్సార్ రైతు భరోసా(YSR Rythu Bharosa) అని పేరు పెట్టారని.. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి.. పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం రూ. 5,300 కోట్లను నిలిపివేసినట్టు తెలిసిందని రఘురామ‌రాజు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని.. అలా కాకుండా ఏదో సొంత జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, ఆయన తండ్రి ఫొటో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Updated On 8 Nov 2023 12:41 AM GMT
Yagnik

Yagnik

Next Story