ఎంతైనా చెప్పండి రఘురామకృష్ణరాజు(Raghu ramakrishna raju) కాన్ఫిడెన్సే కాన్ఫిడెన్స్‌! ఆ మాత్రం నమ్మకం ఉండాలి లేండి! లేకపోతే రాజకీయాలలో ఎలా మనగలుగుతారు? పాపం కూటమి(Alliance) తరపున నరసాపురం(Narsapuram) లోక్‌సభ టికెట్ తనదేనని ప్రకటించుకున్న రఘురామకృష్ణరాజు ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీ(BJP) ఎగరేసుకుపోవడంతో బిత్తరపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం మానలేదు.

ఎంతైనా చెప్పండి రఘురామకృష్ణరాజు(Raghu ramakrishna raju) కాన్ఫిడెన్సే కాన్ఫిడెన్స్‌! ఆ మాత్రం నమ్మకం ఉండాలి లేండి! లేకపోతే రాజకీయాలలో ఎలా మనగలుగుతారు? పాపం కూటమి(Alliance) తరపున నరసాపురం(Narsapuram) లోక్‌సభ టికెట్ తనదేనని ప్రకటించుకున్న రఘురామకృష్ణరాజు ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీ(BJP) ఎగరేసుకుపోవడంతో బిత్తరపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం మానలేదు. ఇప్పటికీ తనకు టికెట్‌ గ్యారంటీ అని చెబుతున్నారు. ఎక్కడ్నుంచో చెప్పలేను కానీ పోటీ చేయడం మాత్రం పక్కా అని రఘురామకృష్ణరాజు అంటున్నారు. తను నమ్ముకున్న దైవం చంద్రబాబు(Chandrababu) తనను మోసం చేయబోరని, ఏదో చోట తనను పోటీకి దింపుతారని అనుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు మనోస్థయిర్యం దెబ్బతినకుండా తెలుగుదేశంపార్టీ మీడియా రోజుకో కథను వండి వారుస్తోంది. రఘురామ పోటీ చేసి తీరతారని, ఇందుకు సంబంధించి కూటమిలో సంప్రదింపులు జరుగుతున్నాయని పత్రికలు రాస్తున్నాయి. బీజేపీ నుంచి నరసాపురం సీటు తీసుకునేందుకు రఘురామకృష్ణరాజు ఢిల్లీలో విపరీతంగా పైరవీలు నడిపిస్తున్నారట! ఆ ప్రయత్నం ఫలించకపోతే మాత్రం ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆ కథనాల సారాంశం. రఘురామ కూడా ఇదే మాట అంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన(Janasena) కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమని చెబుతున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుందని, ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో అన్నది ఇంకా కన్ఫామ్‌ కాలేదని చెబుతూ పోటీ చేయడమైతే పక్కా అని అంటున్నారు. ఎంపీగా బరిలో నిలవాలన్నది తన ఆశ అని, అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక అని రఘురామ చెప్పుకొచ్చారు. పైగా ఆయనను చాలా మంది అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారట!

Updated On 5 April 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story