R Krishnaiah : జగన్ ఓ సంఘ సంస్కర్త.. గెలిపించి రుణం తీర్చుకోవాలి
50 ఏళ్ల నుంచి 12 వేల ఉద్యమాలు చేశామని.. ఎన్నో సాధించి బీసీలకు అండగా నీలిచామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
50 ఏళ్ల నుంచి 12 వేల ఉద్యమాలు చేశామని.. ఎన్నో సాధించి బీసీలకు అండగా నీలిచామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. విజయవాడలో దేవినేని అవినాష్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్‌లో CM జగన్ అమలు చేస్తున్న స్కీమ్ లు మరెక్కడా లేవన్నారు. పేద కులాల అభివృద్ధికి దైర్య సాహసాలతో పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కర్ణాటక ముఖ్యమంత్రిని కలిశాను.. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలని మెచ్చుకున్నారు. ఇన్ని పథకాలు అమలు చేయాలంటే ఎవరు వల్ల కాదు ఆని చెప్పారని వివరించారు.
అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు ఇంత న్యాయం జరగలేదన్నారు. ఓట్ల కోసం మిగిలిన పార్టీలు ప్రయత్నం చేస్తారు కానీ.. న్యాయం చేయటానికి ముందుకు రారన్నారు. బీసీలకు అండగా నిలిచిన జగన్‌ను గెలిపించి బీసీలు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలు తిరిగివస్తే కానీ జగన్ విలువ ఇక్కడ ఉన్న వారికి అర్థం అవుతుందన్నారు. పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత జగన్ సొంతమన్నారు.
జగన్ ఒక సంఘ సంస్కర్త లాంటి వారు.. బీసీలకు జగన్ అనేక సీట్లు ఇచ్చి వారిని గెలిపించారని అన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టటానికి కృషి చేసింది జగన్ అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో మీటింగ్ లకు వెళ్తుంటే అక్కడ ప్రజలు మమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ లో కలపండి అని అడుగుతున్నారు. రాష్ట్రంలో అయితే అనేక పథకాలు వస్తాయి. విద్య ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉందని వారు ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. జగన్ బీసీ లకు వేసిన పునాదిని సద్వినియోగం చేసుకొని బీసీలు ఎదగాలన్నారు.
దేవినేని నెహ్రూ తనకు మంచి సుపరిచితుడు. బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి పని చేసే వారు. అవినాష్ ఇక్కడ పడుతున్న కష్టం చూసి అశ్చర్య పోయానన్నారు. ఇంఛార్జ్‌గా ఉంటూనే కోట్లాది రూపాయలతో అభివృధి పనులు చేశారన్నారు. గొప్ప మెజారిటీతో అవినాష్ నీ గెలిపించాలని కోరారు. అవినాష్ గెలుపు కోసం బీసీలు అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. అటు జగన్, ఇటు అవినాష్ తప్పకుండా గెలవాలన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని.. కష్టపడి పని చేసే నేతలకి ప్రజలు అండగా ఉండాలన్నారు.