తెలంగాణలో(Telangana) బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌(Congress)ప్రభుత్వం రాగానే చాలా మంది గులాబీ నేతలు హస్తం గూట్లోకి వెళ్లిపోయారు.

తెలంగాణలో(Telangana) బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌(Congress)ప్రభుత్వం రాగానే చాలా మంది గులాబీ నేతలు హస్తం గూట్లోకి వెళ్లిపోయారు. అచ్చంగా అలాగే ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) ప్రభుత్వం గద్దె దిగి తెలుగుదేశంపార్టీ (TDP)నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే వైసీపీకి చెందిన కొందరు టీడీపీలోకి జంపయ్యారు. ఎగేసుకుంటూ వెళ్లారు కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఉక్కపోత మొదలయ్యింది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్‌ అలీంబాషా(Aleembasha),మరో ఎనిమిది కౌన్సిలర్లకు తత్వం బోధపడింది. పార్టీలో చేర్చుకుని, ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మనస్తాపం చెందారు. ఇక్కడుంటే లాభం లేదనుకుని తిరిగి వైసీపీలోకి రాబోతున్నారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithuna Reddy)సమక్షంలో వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. నెల రోజుల కిందట టీడీపీలోకి వెళ్లిన పుంగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ అలీంబాషాతో మ‌రో ఎనిమిది మంది కౌన్సిల‌ర్లు, అలాగే వ‌క్ఫ్‌బోర్డు జిల్లా అధ్య‌క్షుడు అమ్మూ తిరిగి వైసీపీలోకి వచ్చేస్తున్నారు. వీరందరిని ఇవాళ తిరుప‌తి వేదిక‌గా వైసీపీలోకి మిధున్‌రెడ్డి ఆహ్వానించ‌నున్నారు.

ehatv

ehatv

Next Story