ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పింఛన్‌దారులు(Pensions) నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ, వార్డు, సచివాలయాలకు వెళితే వృద్ధుల కష్టాలు కనిపిస్తాయి. జగన్మోహర్‌రెడ్డి(Jagan mohanreddy) ముఖ్యమంత్రి అయ్యాక గత 55 నెలలుగా ఇంటిదగ్గరకే వాలంటీర్లు(Volunteers) వచ్చి పింఛన్‌ను అందించారు. వాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ తనకు అత్యంత నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పింఛన్‌దారులు(Pensions) నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ, వార్డు, సచివాలయాలకు వెళితే వృద్ధుల కష్టాలు కనిపిస్తాయి. జగన్మోహర్‌రెడ్డి(Jagan mohanreddy) ముఖ్యమంత్రి అయ్యాక గత 55 నెలలుగా ఇంటిదగ్గరకే వాలంటీర్లు(Volunteers) వచ్చి పింఛన్‌ను అందించారు. వాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ తనకు అత్యంత నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. ఎన్నికల సంఘం కూడా పూర్వాపరాలను విచారించకుండా వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదంటూ ఆదేశించింది. ఓ మూడు నెలల పాటు అవ్వలు, తాతలు పింఛన్‌ కోసం కాళ్లీడ్చుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎలాగైతేనేమీ వాలంటీర్లను అడ్డుకోగలిగామంటూ సంబరపడ్డారు చంద్రబాబు. కానీ పింఛన్‌దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన ఊహించలేదు. ఇప్పుడందరూ చంద్రబాబును తిట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో 66 లక్షల మంది పింఛన్‌దారులు, వారి కుటుంబసభ్యులను టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనన్న భయం చంద్రబాబుకు(Chandrababu) నిద్రపట్టకుండా చేస్తోంది. వెంటనే ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. యూటర్న్‌ తీసుకోవడంలో చంద్రబాబుకు మించిన వారు ఉండరు కదా! గాయం ఆయనే చేస్తారు.. లేపనం కూడా ఆయనే పూస్తారు. పింఛన్‌దారులు తిరగబడేసరికి ఇంటి దగ్గరకే వెళ్లి పింఛన్లు అందించాని ఏపీ మొదలుకొని ఢిల్లీ వరకు లేఖలు రాశారు. లేఖలను చూపించి పింఛన్‌దారుల ఆగ్రహాన్ని చల్లారుద్దామనుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన జరిగింది. ఇవాళ్టి నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయిదేళ్ల కిందటి దృశ్యాలు గ్రామ, వార్డు, సచివాలయాల దగ్గర కనిపిస్తున్నాయ. వృద్ధులు, దివ్యాంగులు, వితంతుల వరిస్థితి దారుణంగా ఉంది. బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకురావడానికి ఈజీగా రెండు మూడు గంటల సమయం పడుతుందని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో పాపం పెన్షన్‌ డబ్బుల కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పింఛన్‌దారులు చంద్రబాబును తిట్టుకుంటున్నారు. తమకు ఇబ్బందులు తెచ్చిపెట్టిన చంద్రబాబుకు ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అల్టీమేటమ్‌ ఇస్తున్నారు.

Updated On 3 April 2024 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story